Rajagopal Reddy: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. బీజేపీలో చేరే తేదీ ఎప్పుడో చెప్పేసిన రాజగోపాల్‌ రెడ్డి.

|

Aug 05, 2022 | 4:49 PM

Rajagopal Reddy: కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ పూర్తయింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన రాజగోపాల్‌ బీజేపీలో చేరికపై అమిత్‌షాతో చర్చించారు...

Rajagopal Reddy: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. బీజేపీలో చేరే తేదీ ఎప్పుడో చెప్పేసిన రాజగోపాల్‌ రెడ్డి.
Follow us on

Rajagopal Reddy: కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ పూర్తయింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన రాజగోపాల్‌ బీజేపీలో చేరికపై అమిత్‌షాతో చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్‌ తాను ఈనెల 21 బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతానని, ఈ సభకు అమిత్‌ షా వస్తారని తెలిపారు. బీజేపీలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాజగోపాల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మలి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని బిజెపి నేతలు నన్ను పార్టీలో చేరాల్సిందిగా చాలా కాలంగా ఆహ్వానిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు బీజేపీలో చేరుతున్నాను. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డందున, బీజేపీతోనే అది సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. మునుగోడులో నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చింన తర్వాతనే రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా లేఖను సిద్ధం చేసి పెట్టుకున్నాను  స్పీకర్ ను కలిసి నా రాజీనామా ఆమోదింపచేసుకుంటాను.

రాష్ట్రంలో అభివృద్ధి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కి మాత్రమే కాకుండా నా నియోజకవర్గానికి కూడా అందాలని ఎన్నికలకు సిద్ధపడ్డాను’ అని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్ప కలిగేలా మునుగోడు తీర్పు ఉంటుందని భావిస్తూ రాజీనామా చేశానని తెలిపిన రాజగోపాల్‌.. చేరికకు సంబంధించి ముందు బండి సంజయ్‌తో చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఆయన పాదయాత్రలో ఉన్నందున అమిత్ షాను కలవమని సూచించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రాజగోపాల్‌ రెడ్డి ఇంకా ఎమన్నారంటే..