Barrelakka: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా.? కొల్లాపూర్‌లో ఫలితం ఏంటంటే..

|

Dec 03, 2023 | 11:42 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్‌ అంటూ ట్రెండ్‌ అయిన శిరీష ఈసారి ఎన్నికల్లో నిలబడిన విషం తెలిసిందే. కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నిలిచిన బర్రెలక్క దేశం దృష్టిని ఆకర్షించింది. నిరుద్యోగుల తరపును పోరుడుతన్నానని చెప్పుకున్న శిరీషకు పలువురు ప్రముఖులు మద్ధతు పలికారు..

Barrelakka: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా.? కొల్లాపూర్‌లో ఫలితం ఏంటంటే..
Barrelakka
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను టచ్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సుమారు 66 స్థానాల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ కొనసాగుతోంది. దీంతో ఇక తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ పాలనేనని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో పలు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇలాంటి స్థానాల్లో కొల్లాపూర్ నియోజకవర్గం ఒకటి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్‌ అంటూ ట్రెండ్‌ అయిన శిరీష ఈసారి ఎన్నికల్లో నిలబడిన విషం తెలిసిందే. కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నిలిచిన బర్రెలక్క దేశం దృష్టిని ఆకర్షించింది. నిరుద్యోగుల తరపును పోరుడుతన్నానని చెప్పుకున్న శిరీషకు పలువురు ప్రముఖులు మద్ధతు పలికారు. ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆమెకు మద్ధతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే.. ఫలితాలు వస్తున్న తరుణంలో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది. అయితే తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బర్రెలక్క ముందజంలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు స్పష్టమైంది. అయితే ఈవీఎమ్‌లలో మాత్రం బర్రెలక్క వెనకపడింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ముందు వరుసలో నిలిచిన శిరీష ఈవీఎమ్‌ ఓట్లలో వెనుకంజ వేసింది. విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన శిరీషకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు వచ్చాయి. దీంతో శిరీషకు మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపలి కృష్ణరావు 9,797 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో బర్రెలక్క వెయ్యి లోపు ఓట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :