తన ఇంటిని ఔషధ మొక్కలు వనంగా మారి.. ఆ ఇల్లునే ప్రకృతి వైద్యాలయం గా మార్చింది ఆమె.. దీర్ఘకాలిక వ్యాధులకు ఔషద మొక్కల ద్వారా ఆయుర్వేద వైద్యం చేస్తూ ఎందరికో రోగులకు సాయం చేస్తున్నారు..ఒక ఇల్లాలు గా.. ఒక తల్లి గా.. ఒక ప్రకృతి వైద్యురాలు గా.. ఒక సామాజిక సేవకురాలు గా.. గుర్తింపు పొందుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న సత్తుపల్లి కి చెందిన సుధా రాణి గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన సుధారాణి, సురేష్ దంపతులు ..ఇద్దరు పిల్లలు ఉన్నారు..సుధా ఎమ్మెస్సి నర్సింగ్ చదివింది.. కొద్దిరోజులు నర్సుగా పని చేసింది. కుమారుడు పుట్టుకతో మానసిక ఎదుగుదల లోపంతో జన్మించాడు..పలు ఆసుపత్రులకు తిరిగినా ..పలితం లేకపోవడం తో..ఇంట్లోనే సుధారాణి తన కుమారుడు కి వైద్యుడు గా మారి..చికిత్స చేసింది..అనేక రకాల ఔషధ మొక్కలు పెంచుతూ..వాటి ద్వారా తన అమ్మమ్మ ద్వారా నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం చేసింది..దాదాపుగా కొడుకుని నార్మల్ స్టేజి కి తీసుకు వచ్చింది..కరాటే లో శిక్షణ ఇప్పించి..బ్లాక్ బెల్ట్ సాధించాడు..ఎన్నో పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాడు..తన కుమారుడు కే కాదు సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపన సుధారాణి కి ఉంది..
అందుకే తనకు మొక్కలు అంటే ప్రాణం..తన ఇంటి ఆవరణను ఔషధ మొక్కలు వనంగా..ఇంటినే ప్రకృతి వైద్యా లయంగా మార్చింది..కొన్ని సంవత్సారాల నుండి ఔషధ మొక్కలు పెంచుతూ..పంచుతోంది..అవన్నీ పెంచేది తన కోసం కాదు.. సమాజం లో దీర్ష కాలిక రోగాలతో బాధ పడుతున్న వారు అనేక ప్రాంతాల నుంచి..వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తీసుకు వెళతారు..తన తాతయ్య ఆయుర్వేద వైద్యుడు..అతని దగ్గర నేర్చుకున్న వైద్యాన్ని నలుగురి కి ఉపయోగ పడేలా సుధ చేస్తోంది. ఔషద మొక్కలు నుంచి ..మందులు తయారు చేస్తూ..వచ్చిన వారికి అందిస్తారు..పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు
ఖమ్మం జిల్లా, తెలంగాణ, ఏపి, తమిళనాడు, కర్ణాటక నుంచే కాకుండా.. అమెరికా, చైనా, నేపాల్ విదేశాల నుంచి సుధ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటారు. క్యాన్సర్,హెచ్ ఐ వి , షుగర్, బిపి, ఆస్తమా , గ్యాస్ ట్రబుల్, ఇతర నొప్పులు వంటి రోగాలకు ఆయుర్వేద వైద్యం చేస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులు వెళ్లి.. లక్షలు చెల్లించినా..నయం కాని క్యాన్సర్ వంటి రోగాలకు సుధారాణి తన వైద్యం తో ఎందరికో ప్రాణదానం చేసింది.
సామాజిక సేవలోనూ సుధా ముందు ఉంటుంది.. కరోనా సమయం లో అనాథలకు,పేదలకు కూరగాయలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటికీ ఏదో ఒక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు..ఈమె సేవలకు ఎన్నో అవార్డులు ,ప్రశంసలు దక్కాయి..మహిళ అంటే..చీరలు, బంగారం పై మక్కువ ఉంటుంది. తను, తన కుటుంబం బాగుండాలి అనుకుంటారు. అయితే సుధా అలా కాదు.. సమాజం కోసం ఏదో చేయాలి.. అనే తపన ఇన్ని వేలమందికి సేవలు అందిస్తోంది. అమ్మగా, భార్యగా, గృహిణిగా, ఇటు సమాజ సేవకురాలుగా, ప్రకృతి వైద్యురాలుగా అనేక బాధ్యతలు..సవాళ్లు ఎదుర్కొంటూ చేస్తున్నారు. పలువురు కి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Reporter: Narayana Rao
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..