
Delhi liquor scam case: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం విచారించి.. ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక పాత్ర పోషించారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధమున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే.. కవిత పీఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. అరెస్టయిన వారు ఇచ్చిన ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేయగా.. అందులో కవిత పేరును కూడా అధికారులు చేర్చారు. అనంతరం.. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు జరగుతాయోనన్న ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..