
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద.! సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పిల్లలు, పెద్దలు అందరూ కూడా కుటుంబంతో కాసింత సమయాన్ని గడిపేందుకు సొంతూళ్లకు వెళ్తుంటారు. మన తెలుగువారికి ముఖ్యమైన పండుగైన సంక్రాంతి అంటేనే.. తెలుగింటి సంప్రదాయాలు, రుచికరమైన వంటలు.. ఇలా ఎన్నో ఉంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. మన ఊర్లో తెగ ఎంజాయ్ చేయవచ్చు. ఇక తెలంగాణలో విద్యార్ధులు ఎగిరిగంతేసేలా.. సంక్రాంతి సెలవులు ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
సాధారణంగా తెలంగాణలో సంక్రాంతి సెలవులు అంటేనే తక్కువ ఉంటాయి. గతేడాది జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విద్యాశాఖ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. జనవరి 10 రెండో శనివారం, జనవరి 11 ఆదివారం, జనవరి 18 ఆదివారం కలిసొస్తుండటంతో ఏపీతో సమానంగా తెలంగాణలోని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు 9 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరి 19న అనగా సోమవారం తిరిగి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే దీనిపై రెండు లేదా మూడు రోజుల్లో తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
కొత్త నెల వచ్చిందంటే చాలు.. ముందుగా సెలవులు ఎప్పుడున్నాయనే దాన్నే గమనిస్తారు విద్యార్ధులు. ఈ ఏడాది సంక్రాంతి, రిపబ్లిక్ డే లాంటివి ఉండటంతో.. ఈసారి ఈ నెలలో భారీగా సెలవులు రానున్నాయి. జనవరి 1(గురువారం) కొత్త సంవత్సరం సెలవు కాగా.. జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు ఉండనుంది. ఇక సాధారణ సెలవుల విషయానికొస్తే.. 4 ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఎలాగో ఉంటాయి. ఇక సంక్రాంతి సెలవులు దాదాపుగా 9 రోజులు కలిసొస్తాయి. లాంగ్ వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేవారు.. ఈ నెలను ఈజీగా సద్వినియోగం చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి