Kishan Reddy: ‘రాహుల్ గాంధీ ఎవరి కోసం మాట్లాడుతున్నారు’ – కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ దేశ సైనిక బలగాలను బలహీనపరచే ప్రయత్నాలు చేస్తున్నారని, భారత స్వదేశీ రక్షణ వ్యవస్థలను నిందించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.

Kishan Reddy: రాహుల్ గాంధీ ఎవరి కోసం మాట్లాడుతున్నారు - కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
Kishan Reddy - Rahul Gandi

Updated on: May 26, 2025 | 12:16 PM

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని బలహీనపర్చే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా ఇది జరుగుతోందని.. దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధిని దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కిషన్ రెడ్డి ఎత్తి చూపిన రాహుల్ వ్యాఖ్యలు

 

స్వదేశీ రక్షణ రంగంపై చిన్నచూపు:


రాహుల్ గాంధీ విదేశీ సాంకేతికతలను, ముఖ్యంగా ఇతర దేశాల డ్రోన్లను ప్రశంసిస్తూ.. భారత స్వదేశీ రక్షణ రంగంలో సాధించిన ప్రగతిని ఎద్దేవా చేశారేని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రఫేల్ ఒప్పందంపై ఆరోపణలు:


భారత వాయుసేనను ఆధునీకరించేందుకు తీసుకువచ్చిన రఫేల్ జెట్ కొనుగోలును రాహుల్ గాంధీ కుంభకోణంగా పేర్కొన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రక్షణ ప్రణాళికలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు.

అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు


అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను రాహుల్ గాంధీ విమర్శించడం ద్వారా, భారత సైనికులను అవమానించారని.. రక్షణ రంగంలో జరిగిన విప్లవాత్మక మార్పులను తిరస్కరించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

‘మేక్ ఇన్ ఇండియా’ పథకంపై విమర్శలు:


స్వదేశీ ఉత్పత్తి, ప్రత్యేకంగా రక్షణ రంగంలో స్వావలంబనను పెంపొందించే ప్రయత్నాలను, మేకిన్ ఇండియా ప్రయత్నాలను రాహుల్ గాంధీ కించపరిచారని కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో వివరించారు. రాహుల్ ఎవరి కోసం మాట్లాడుతున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. కిషన్ రెడ్డి హైలెట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..