ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!

సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అశుభమని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది లాంటి వాటిని నమ్మరు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అది నిజమనే నమ్మకం మీకు కలుగవచ్చు. అవును కూలీలతో వెళ్తొన్న ఓ ఆటుకు పిల్లి ఎదురురావడంతో అది అదుపుతప్పి బోల్తా పడంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది కూలీలు గాయపడ్డారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.

ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!
Khammam Road Acciden

Edited By:

Updated on: Aug 25, 2026 | 9:16 PM

ఖమ్మం జిల్లా తీవ్ర విషాదం వెలుగు చూసింది. వేంసూరు మండలం ఎర్రగుంటపాడు శివారులో మంగళవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఓ ఆటో పిల్లి ఎదురురావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మహిళా కూలీలు గాయపడగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. వేంసూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన 10 మంది మహిళా కూలీలు రాయుడుపాలెం, కల్లూరుగూడెం శివారులోని మెట్ట పొలాల్లో మిరప నారు నాటేందుకు ఆటోలో బయలుదేరారు. అయితే ఎర్రగుంటపాడు శివారు ప్రాంతానికి చేరుకోగానే ఆటోకు హఠాత్తుగా ఒక పిల్లి అడ్డు వచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 10 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు మహిళలను మెరుగైన వైద్యం కోసం వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

అయితే పిల్లి అడ్డు రావడం కారణంగానే ఇంతటి తీవ్ర ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనతో ఎక్కడికైనా వెళ్లేప్పుడు పిల్లి ఎదురొస్తే ఆగి వెళ్లమని చెప్తారని.. అశుభంగా భావిస్తరనే మరోసారి చర్చకు వచ్చింది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదంలో కూలీలు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ ఆవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us