ఎప్పటిలానే ఆ రోజు కూడా ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు రైల్వే పోలీసులు. అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను ఆరా తీస్తూ.. ప్రతీ ప్లాట్‌ఫార్మ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ఫ్లాట్‌ఫార్మ్ చేరుకునేసరికి ముగ్గురు పోలీసులకు ఫస్ట్ ఫుట్-ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నాలుగు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. అక్కడున్న షాపులకు సంబంధించిన వ్యక్తులవా.? లేక పాసింజర్లవా.? లేక ఇంకెవరికైనా ఈ బ్యాగులు చెందుతాయా.! అని ఎంక్వయిరీ చేశారు రైల్వే పోలీసులు. వారెవరూ కూడా తమవి కాదు అని చెప్పడంతో.. వాటిని తెరిచి చూడగా దిమ్మతిరిగింది. మూడు స్టూడెంట్ బ్యాగుల్లో 14 ప్యాకెట్ల ఎండు గంజాయి, అలాగే ఒక హ్యాండ్ స్టిక్ బ్యాగ్‌లో ఒక ప్యాకెట్ ఎండు గంజాయి లభ్యమైంది. సుమారు 28 కేజీలు బరువున్న ఈ ఎండు గంజాయి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.