
చెయ్యెత్తి బస్సు ఆపని ఈ రోజుల్లో.. ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం అంటూ.. స్వయంగా బస్సు డ్రైవర్ ప్రయాణికులకు స్వాగతం పలకడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపో కు చెందిన మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచన మేరకు ప్రతి బస్సు ప్రయాణానికి ముందు కండక్టర్ లేదా డ్రైవర్ ప్రయాణికులను ఉద్దేశించి ప్రయాణికు లందరిని ఆత్మీయంగా పలకరించాలి.
బస్సు ఎక్కడినుండి ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుపుతూ ఎంత సమయం పడుతుందో ప్రయాణికులకు వివరిస్తూ.. ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూన్నారు ఆర్టీసీ సిబ్బంది. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని ప్రయాణికులను RTC సిబ్బంది కోరడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుందని సౌకర్యమంతమైన ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని కోరుతున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ కండక్టర్ ఆత్మీయంగా పలకరిస్తూ వివరించటం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. దురుసుగా మాట్లాడే ఆర్టీసీ కాస్త ఫ్రెంఢ్లీ ఆర్టీసీగా మారిపోయింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..