Singareni Election: సింగరేణిలో పాగా వేసేదెవరు.. గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం..

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 27న అంటే రేపే పోలింగ్‌. 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు ఏరియా ల్లో 23 పోలింగ్ స్టేషన్లు,నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Singareni Election: సింగరేణిలో పాగా వేసేదెవరు.. గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం..
Telangana Singareni Elections

Edited By:

Updated on: Dec 26, 2023 | 9:51 PM

సింగరేణి ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ లోని ఆరు జిల్లాల పరిధిలో కొల్ బెల్ట్ ఏరియాలో హోరాహోరిగా ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో హేమహేమి నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఓట్లను అకట్టు కోవడానికి అధికార పార్టీ మంత్రులు సింగరేణి కార్మికులకు పలు వరాలను ప్రకటించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే పోలీంగ్‌ కు సింగరేణి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరం లోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాలో ఈ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. డిసెంబర్ 27న అంటే రేపే పోలింగ్‌. 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. దాదాపు 40 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఈ సంస్థలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరుగగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసి ఓసారి, బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు ఏరియా ల్లో 23 పోలింగ్ స్టేషన్లు,నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు..7వేల 476 మంది ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. అటు .మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 31 పోలింగ్ కేంద్రాల్లో 14వేల 985 మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్.. ఏడు గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.

ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి తో పాటు బీఆర్‌ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి సంఘంతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడు కోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…