CM KCR: మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? ఈరోజు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర భేటీ..

|

Jan 17, 2022 | 7:02 AM

Telangana Cabinet Meeting Today: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ అ

CM KCR: మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..? ఈరోజు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర భేటీ..
Cm Kcr
Follow us on

Telangana Cabinet Meeting Today: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ అత్యవసరంగా భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలే మెయిన్ ఎజెండాగా (Telangana Cabinet Meeting) సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు దాదాపు 2 వేలకుపైగా (Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజ్‌లకు సంక్రాంతి సెలవులు పొడగించారు. ఆరోగ్యశాఖ సూచన మేరకు జనవరి 30 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మరి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. వీకెండ్‌లో లాక్‌డౌన్ కూడా విధిస్తున్నాయి.

ఇక మల్టీప్లెక్స్, థియేటర్ల విషయంలోనూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి రాష్ట్రాలు. పలుచోట్ల కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే నేటి కేబినెట్‌ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు లేకపోయినా…నైట్‌ కర్ఫ్యూ విధించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక వ్యాక్సినేషన్‌ అంశంపైనా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బూస్టర్ డోసులు, 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు కూడా టీకాలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ పలుచోట్ల సెకండ్ డోస్‌ విషయంలో ఆలస్యం జరుగుతోంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించనున్నారు. నివేదికపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే లాక్ డౌన్ పై విధించే అవకాశాలపై సైతం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా నైట్ కర్ఫూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాస్కులు ధరించని, నిబంధనలు పాటించని వారికి భారీగా ఫైన్ లు విధించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంకా సభలు, సమావేశాలపై సైతం ఆంక్షలను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే సంక్రాంతి వేడుకల నేపథ్యంలో కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ అత్యవసరంగా భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా కట్టడికోసం మంత్రివర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. తెలుగు రాష్ట్రాల్లో..

Bank Loan: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక చౌకగా రుణాలు..!