Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. తెలుగు రాష్ట్రాల్లో..

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. తెలుగు రాష్ట్రాల్లో..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 17, 2022 | 6:16 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ధరలు నిత్యం పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,090 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,090 గా ఉంది. తులం బంగారంపై రూ.10 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,140 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 వద్ద ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440 వద్ద కొనసాగుతోంది. * పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. * కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది. * ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. * విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Bank Loan: ఆ బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక చౌకగా రుణాలు..!

MEIL: మేఘా ఇంజనీరింగ్ మరో మైలురాయి.. జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌లో 5 కిమీల టన్నెలింగ్ పూర్తి..