KCR Exclusive Interview: లిక్కర్‌ స్కామ్‌ అంతా బోగస్‌.. మోడీ సృష్టే.. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది

|

Apr 23, 2024 | 10:09 PM

KCR Exclusive Interview with Rajinikanth TV9 Live: తెలంగాణలోనే టాలెస్ట్‌ లీడర్‌, తెలంగాణ ఉద్యమ రథసారధి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. పద్నాలుగేళ్లపాటు ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కేసీఆర్‌తో టీవీ9 ఇంటర్వ్యూ ఓ సంచలనం..

KCR Exclusive Interview: లిక్కర్‌ స్కామ్‌ అంతా బోగస్‌.. మోడీ సృష్టే.. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది
Kcr Live Show

KCR Exclusive Interview with Rajinikanth TV9: తెలంగాణలోనే టాలెస్ట్‌ లీడర్‌, తెలంగాణ ఉద్యమ రథసారధి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు. పద్నాలుగేళ్లపాటు ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కేసీఆర్‌తో టీవీ9 ఇంటర్వ్యూ ఓ సంచలనం. కేసీఆర్‌ ఓ టీవీ ఛానెల్‌ స్టూడియోకొచ్చి పుష్కరకాలమైంది. పన్నెండేళ్లక్రితం టీవీ9 స్టూడియోకొచ్చారు కేసీఆర్‌. మళ్లీ ఇప్పుడు మరోసారి టీవీ9 స్టూడియోలో అడుగుపెట్టారు. టీవీ9 వేదికగా ఈరోజు రాత్రి 7గంటలకు తెలుగు మీడియా చరిత్రలోనే బిగ్గెస్ట్‌ లైవ్‌షో జరగబోతోంది. టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ లైవ్‌షోలో పాల్గోబోతున్నారు కేసీఆర్‌.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2024 10:07 PM (IST)

    నా కూతురు కవితపై అక్రమంగా కేసు పెట్టారు

    ఇతర పార్టీల నుంచి 700 మందిని పార్టీలోకి తీసుకున్నారు. ప్రభుత్వాలను అక్రమంగా కూల్చారన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ సూత్రధారి అని అన్నారు. సంతోష్‌పై కేసు పెట్టామని కక్ష కట్టి నా కూతురు కవితపై అక్రమ కేసు పెట్టించారని మండిపడ్డారు. ఫలితం అనుభవించక తప్పదన్నారు.

  • 23 Apr 2024 10:03 PM (IST)

    లిక్కర్‌ కేసులో అమాయకులను శిక్షిస్తున్నారు

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ఎలాంటి రికవరీలు లేకుండానే అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.


  • 23 Apr 2024 10:01 PM (IST)

    మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అవుతా-కేసీఆర్‌

    తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతానని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీల కారణంగానే తాము ఓడిపోయామని అన్నారు.

  • 23 Apr 2024 09:59 PM (IST)

    ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం

    తెలంగాణలో మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే అధికారమని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీల వల్లే తాము ఓడిపోయామని అన్నారు. ఏదీఏమైనా బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అవుతానని, సీఎం కాగానే తొలి ఇంటర్వ్యూ టీవీ9కే ఇస్తానని అన్నారు.

  • 23 Apr 2024 09:48 PM (IST)

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అంతా బోగస్‌.. మోడీ సృష్టే

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అంతా బోగస్‌ అని, అంతా మోడీ సృష్టేనని కేసీఆర్‌ అన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. నా కూతురు కవితకు ఏమి తెలియదని, లిక్కర్‌ స్కామ్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో తాను పోరాడుతున్నానని, నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.

  • 23 Apr 2024 09:45 PM (IST)

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది

    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. లిక్కర్‌ స్కామ్‌ అనేది అదొక బోగస్‌ అని, నా కూతురు కవితకు ఏమి తెలిదని, ముత్యం లాగా బయటకు వస్తుందన్నారు. నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది. లిక్కస్‌ స్కామ్‌ అనేది మోడీ సృష్టించినదేనని అన్నారు.

  • 23 Apr 2024 09:36 PM (IST)

    కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదు

    కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రాజెక్టుపై A-గ్రేడ్‌ ప్రాజెక్టు అని సర్టిఫికేట్‌ వచ్చిందన్నారు. మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చన్నారు. వందల టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు.

  • 23 Apr 2024 09:19 PM (IST)

    సీడబ్ల్యూసీ చైర్మన్‌ కూడా కాళేశ్వరం ఓ అద్భుతమన్నారు

    సీడబ్ల్యూసీ చైర్మన్‌ కూడా కాళేశ్వరం ఓ అద్భుతమని అన్నారని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఎడారి కావాలని కాంగ్రెస్‌ చూస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

  • 23 Apr 2024 09:15 PM (IST)

    అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు

    తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు 24 గంటల పాటు విద్యుత్‌ అందించామని కేసీఆర్‌ అన్నారు. 3 రూపాయల 9 పైసలకు విద్యుత్‌ కొనుగోలు చేశామని, ఎన్‌టీపీసీ సంస్థ రూ.15కు యూనిట్‌ ఇస్తామని చెప్పిందన్నారు. తెలంగాణను అస్థిరపరిచేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేశారన్నారు.

  • 23 Apr 2024 09:10 PM (IST)

    అలా అనడం కాంగ్రెస్‌ వాళ్లు మూర్ఖత్వం

    మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు సహజమన్నారు. కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్‌మానేరు కట్ట ఒక్కవానకే కొట్టుకుపోయిందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేరు చేయిస్తానని అన్నారు. రూ.100 కోట్లతో పిల్లర్లను రిపేరు చేయవచ్చన్నారు. మహానదులపై కట్టే ప్రాజెక్టుల్లో లోపాలు సహజమన్నారు. కాళేశ్వరాన్ని డిజైన్‌ చేసింది కేసీఆర్‌ అనడం కాంగ్రెస్‌ వాళ్ల మూర్ఖత్వమన్నారు.

  • 23 Apr 2024 09:03 PM (IST)

    మీ చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిపెడతారా?

    మీ చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిపెడతారా? అని ప్రశ్నిచారు. కాళేశ్వరానికి ఏమీ కాలేదని ప్రజలకు అర్థమైందన్నారు. నామీద కోసంతో కాంగ్రెస్‌ వాళ్లు రైతుల పొలాలు ఎండబెట్టారన్నారు. కాళేశ్వరం ఫలించకపోతే 3.5 కోట్ల టన్నుల వడ్లెలా పండాయన్నారు. కాళేశ్వరంతో 40 లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ అవసరం లేకుండా నీళ్లు తీసుకోవచ్చాన్నారు.

  • 23 Apr 2024 08:59 PM (IST)

    తెలంగాణను నాశనం చేస్తుంటే సహించను

    తెలంగాణను నాశనం చేస్తుంటే సహించనని కేసీఆర్‌ అన్నారు. 50 వేల మంది రైతులను తీసుకెళ్లి ధర్నా చేస్తానని అన్నారు. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేరు చేయిస్తానన్నారు. మీ చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిపెడతారా? అని ప్రశ్నించారు.

  • 23 Apr 2024 08:55 PM (IST)

    నీళ్లెలా తీసుకోవాలో ఈ కాంగ్రెస్‌ వాళ్లకు అర్థం కావడం లేదు

    నీళ్లెలా తీసుకోవాలో ఈ కాంగ్రెస్‌ వాళ్లకు అర్థం కావడం లేదని కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం స్టోరేజీ కెపాసిటీ 16 టీఎంసీలేనని అన్నారు. మేడిగడ్డలో 80కిపైగా గేట్లు ఉన్నాయన్నారు. ఎండాకాలంలో రెండో పంటకు, సాగునీటికి కాళేశ్వరం ఎంతో కీలకమన్నారు. 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టామని, ప్రాజెక్టుకు 200 టన్నెల్స్‌ క్షేమంగానే ఉన్నాయన్నారు. కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లు, టన్నెల్స్‌ అన్ని బాగున్నాయన్నారు. మేడిగడ్డ 3 పిల్లర్లలో ఒక్క బ్లాక్‌లో ఇబ్బందిని పెద్దగా చూపిస్తున్నారన్నారు. పిల్లర్‌ కుంగిందని ఎన్నికలకు ముందే తెలుసన్నారు.

  • 23 Apr 2024 08:46 PM (IST)

    నాకు ఇంజనీరింగ్‌ భాష తెలియదు

    కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌ చేసింది మీరేనా అని కేసీఆర్‌ను ప్రశ్నించగా, అందుకు సమాధానంగా.. ప్రాజెక్టుకు డిజైన్‌ చేసింది తాను కాదని, నాకు ఇంజనీరింగ్‌ భాష తెలువదన్నారు. ప్రాజెక్టు డిజైన్‌ చేయడానికి నేను ఇంజనీర్‌ను కాదని, సమైక్య ప్రభుత్వంలో తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష చూపారని ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వాలు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 200 టన్నెల్స్‌ ఉన్నాయన్నారు. తెలంగాణ అవసరాల దృష్ట్యా ప్రాజెక్టుకు డిజైన్‌ చేయాలని చెప్పామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్‌ కాదు.. మల్టీ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అన్నారు. కాళేశ్వరం పురోగతిని బ్యాంకర్లకు ఎప్పటికప్పుడు చూపించామన్నారు.

  • 23 Apr 2024 08:35 PM (IST)

    సమైక్య పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ విధ్వంసం

    తెలంగాణ వచ్చాక ప్రాజెక్టులపై 6 నెలలు మేథోమథనం చేశామని, తెలంగాణ జీవనాధారం చెరువులేనని కేసీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ విధ్వంసం జరిగిందన్నారు. తెలంగాణలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా పంటలకు నీళ్లు అందించామన్నారు.

  • 23 Apr 2024 08:31 PM (IST)

    ఎత్తిపోతల మినహా తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు

    ఎత్తిపోతల మినహా తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ 85 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నారు. సీతమ్మ సాగర్‌ దగ్గర 47 మీటర్ల ఎత్తు ఉందని, కాకతీయులు 75 వేల చెరువులు నిర్మించారని నిజాంరాజులు కూడా చెరువులను కొనసాగించారన్నారు.

  • 23 Apr 2024 08:27 PM (IST)

    తెలంగాణపై సమైక్యపాలకులు వివక్ష చూపారు

    తెలంగాణ సమైక్యపాలకులు వివక్ష చూపారని కేసీఆర్‌ అన్నారు. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. నాపై లేనిపోని ఆరోపణలు, తిట్టడం తప్ప చేస్తుందేమి లేదన్నారు. నాకు తిట్టడం కోసమే అధికారంలోకి వచ్చాన్నారు.

  • 23 Apr 2024 08:23 PM (IST)

    కాంగ్రెస్‌ పార్టీ విఫలమైంది

    విద్యుత్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్‌ ఆరోపించారు. వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు కరెంట్‌ నిరాటంకంగా వచ్చిందా లేదా? అనేది ప్రజలకు తెలుసన్నారు. రెప్పపాటు కరెంటు పోకుండా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందించిన ఘటన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని అన్నారు.

  • 23 Apr 2024 08:21 PM (IST)

    భవిష్యత్‌లో కూడా ప్రణాళికలు రచించాం

    భవిష్యత్‌లో కూడా ప్రణాళికలు రచించామని కేసీఆర్‌ అన్నారు. పవర్‌ ప్లాంట్‌లకు శ్రీకారం చుట్టామని అన్నారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ చేశామన్నారు. విద్యుత్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించామన్నారు.

  • 23 Apr 2024 08:20 PM (IST)

    సింగిల్‌విండోను చట్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

    సింగిల్‌విండో్ను చట్టం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పెట్టుబడుల రంగంలో తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లపై ఏ దర్యాప్తుకైనా సిద్ధమని అసెంబ్లీలోనే చెప్పామన్నారు.

  • 23 Apr 2024 07:55 PM (IST)

    అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంట్‌

    అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంట్‌ ఇచ్చామన్నారు. తెలంగాణ వచ్చాక చెరువులను బాగు చేసుకున్నామని కేసీఆర్‌ అన్నారు. మిషన్‌ కాకతీయ పేరుతో చెరువులను బాగు చేశామన్నారు. బజారు భాష మాట్లాడటం వేరు.. ప్రభుత్వాన్ని నడపడం వేరన్నారు. అవగాహన లేకుండా కాంగ్రెస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. తమ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ పోకుండా చర్యలు చేపట్టామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించామన్నారు.

  • 23 Apr 2024 07:51 PM (IST)

    విద్యుత్‌ వ్యవస్థను దారిలో పెట్టాం- కేసీఆర్‌

    తమ హయాంలో విద్యుత్‌ వ్యవస్థను దారిలో పెట్టామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌కు కూడా ప్రణాళిక రచించామన్నారు. పవర్‌ ప్లాంట్‌లకు శ్రీకారం చుట్టామన్నారు. కరెంటు విషయంలో మా అభివృద్ధి చూసి దేశం ఆశ్చర్యపోయిందన్నారు. రూ.13కియూనిట్‌ కొన్నారని మాట్లాడారని, లాంగ్‌ టర్మ్‌ కోసం ఛత్తీస్‌గఢ్‌ దగ్గర తీసుకున్నామన్నారు.

  • 23 Apr 2024 07:43 PM (IST)

    అజ్క్షానంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు- కేసీఆర్

    అజ్క్షానంతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను దెబ్బకొట్టాలని మోడీ చూశారని, అప్పులపై పరిమితి విధించిందన్నారు. ధ్వంజమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించామన్నారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్రాన్ని బాగు చేసుకున్నామని అన్నారు. నన్ను బదనాం చేశామని కాంగ్రెస్‌ నేతలు సంబరపడచ్చన్నారను. బజారు బాష మాట్లాడటం వేరు.. ప్రభుత్వాన్ని నడపడం వేరన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు.

  • 23 Apr 2024 07:39 PM (IST)

    అప్పులపై తప్పుడు ప్రచారం జరుగుతోంది

    తెలంగాణలో తమ పదేళ్ల పాలనలో అప్పులు పెరిగాయన్నదానిపై కేసీఆర్‌ సమాధానమిచ్చారు. రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్‌ చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ తప్పుడు స్వేతపత్రం విడుదల చేసి తమను బదనాం చేస్తోందన్నారు.

  • 23 Apr 2024 07:34 PM (IST)

    ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌ ఏమన్నారంటే..

    ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ చేసేవి అర్థం పర్థం లేని ఆరోపణలని కేసీఆర్‌ అన్నారు. దేశమే నివ్వెరపోయేలా తెలంగాణ అభివృద్ధి చేశామని, అసెంబ్లీలో కాంగ్రెస్‌వాళ్ల ఆరోపణలు చూసి నవ్వకున్నామన్నారు.

  • 23 Apr 2024 07:32 PM (IST)

    ప్రజాఆకాంక్షలను తీర్చే ప్రయత్నంలో అప్పులు అవుతాయి

    ప్రైవేటు కుటుంబాల అప్పులు వేరు.. ప్రభుత్వ అప్పులు వేరని కేసీఆర్‌ అన్నారు. ప్రజాఆకాంక్షలను తీర్చే ప్రయత్నంలో అప్పులు అవుతాయని, ప్రైవేటు కుటుంబాల అప్పులు వేరని, అప్పులు తెచ్చుకోవడమనేది బడ్జెట్‌లో భాగమన్నారు.

  • 23 Apr 2024 07:28 PM (IST)

    ఒక చిన్న మతకల్లోలం కూడా లేకుండా పదేళ్లు రాష్ట్రాన్ని నడిపాం

    ఒక చిన్న మతకల్లోలం లేకుండా పదేళ్ల పాటు పాలన నడిపామని కేసీఆర్ అన్నారు. ఇతరులను తిడుతూ, దూషణలు చేస్తూ చేసేది పాలన కాదన్నారు. మాకు వన్‌థర్డ్‌ సీట్లు వచ్చాయి.. మమ్మల్ని ప్రజలు తిరస్కరించలేరన్నారు.

  • 23 Apr 2024 07:26 PM (IST)

    కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చూడాలనకుంటున్నారు

    రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చూడాలని చూస్తోందని, తెలంగాణలో వికృత క్రీడా సాగుతుందన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని, పదేళ్ల పాలనలో ఎన్నో చేశామన్నారు. తెలంగాణ ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని, ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు.

  • 23 Apr 2024 07:23 PM (IST)

    కాంగ్రెస్‌ అహాంకారంతో ఉంది

    కాంగ్రెస్‌ పాలనలో ఇప్పుడు అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు.కాంగ్రెస్‌ అజ్ఞాన,అహాంకార పూరిత వ్యవహారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

  • 23 Apr 2024 07:20 PM (IST)

    కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది

    తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు.

  • 23 Apr 2024 06:57 PM (IST)

    టూ స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ..

    తెలంగాణ ఎదురుచూస్తోంది. యస్.. రజినీకాంత్‌ లైవ్‌షో విత్‌ కేసీఆర్‌ కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తోంది. కాసేపట్లో తెలుగు మీడియాలో బిగ్గెస్ట్‌ లైవ్‌షో ప్రారంభంకాబోతుంది.

Follow us on