Telangana: ఆ షాపింగ్ మాల్‌లో రూ.35కే చీరలు.. ఎగబడి కొంటున్న మహిళలు! ఎక్కడంటే..

ఐదున్నర నుంచి తొమ్మిది గజాలుండే చీర ఆడవారికి ఎంతో స్పెషల్. పండగ వచ్చినా.. ఫంక్షన్‌ వచ్చినా.. వెంటనే షాపులకు పరుగులు తీస్తారు. గంటల కొద్దీ షాపింగ్‌ చేసి.. ధరెంతైనా సరే చెల్లించి తమ ముచ్చట తీర్చుకుంటారు. ఏదైనా ఆఫర్‌ ఉంటే చాలు పనిగట్టుకుని మరీ వాలిపోయే మగువలు..

Telangana: ఆ షాపింగ్ మాల్‌లో రూ.35కే చీరలు.. ఎగబడి కొంటున్న మహిళలు! ఎక్కడంటే..
Kasam Shopping Mall In Jogulamba Gadwal

Updated on: Jul 20, 2025 | 5:45 PM

గద్వాల్, జులై 20: చీర.. చూడచక్కని సంప్రదాయమే కాదు. తరాల కథలెన్నో చెబుతుంది. ఐదున్నర నుంచి తొమ్మిది గజాలుండే చీర ఆడవారికి ఎంతో స్పెషల్. పండగ వచ్చినా.. ఫంక్షన్‌ వచ్చినా.. వెంటనే షాపులకు పరుగులు తీస్తారు. గంటల కొద్దీ షాపింగ్‌ చేసి.. ధరెంతైనా సరే చెల్లించి తమ ముచ్చట తీర్చుకుంటారు. ఏదైనా ఆఫర్‌ ఉంటే చాలు పనిగట్టుకుని మరీ వాలిపోయే మగువలు.. తక్కువ ధరకే చీరలు అమ్మే షాపు ఉందంటే ఊరుకుంటారా? ఉదయాన్నే అందరికంటే ముందుగానే నిద్రలేచి షాపు ముందు క్యూ కట్టరూ..! అదే జరిగింది జోగులాంబ గద్వాల జిల్లాలో.

తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో కాసమ్‌ షాపింగ్‌ మాల్‌లో కేవలం రూ.35కే చీర ఆఫర్‌ ప్రకటించింది. దాంతో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయాన్నే షాపింగ్‌ మాల్‌ ముందు క్యూ కట్టారు. షాపు తెరవక ముందే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుని నిరీక్షించసాగారు. ఇంట్లో పనులన్నీ పక్కనపెట్టి మరీ షాపింగ్‌ మాల్‌కి వచ్చేశారు. దీంతో కాసమ్‌ షాపింగ్‌ మాల్‌ వద్ద సందడి నెలకొంది. షాప్‌ ఎదురు మహిళలు క్యూలైన్‌లలో భారీగా నిలబడి పడిగాపులు కాశారు. షాప్‌ తీయకముందే మహిళలు అంత పెద్ద సంఖ్యలో బారులు తీరడం చూసి.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యంతో చూడసాగారు. ఆదివారం (జులై 20) ఉదయం ఈ దృశ్యం కాసమ్‌ షాపింగ్‌ మాల్‌ వద్ద కనిపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.