హెడ్మాస్టర్ అండతో మరింత రెచ్చిపోయాడు.. అమ్మాయిల పట్ల అటెండర్ అసభ్య ప్రవర్తన.. చివరకు..

కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెడ్మాస్టర్ అండతో మరింత రెచ్చిపోయాడు.. అమ్మాయిల పట్ల అటెండర్ అసభ్య ప్రవర్తన.. చివరకు..
Karimnagar Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 28, 2025 | 10:58 AM

కంటికి రెప్పలాగా చూసుకుంటూ.. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగే కామాంధుడు అయ్యాడు.. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంవత్సర కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నాడు. విషయం తెలిసిన తరువాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అటెండర్‌తో పాటు, స్కూల్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో యాకుబ్ పాషా అటెండర్ గా పని చేస్తున్నాడు. గత మూడేళ్ళు గా ఇక్కడనే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. సంవత్సరం కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, క్లోజ్ గా ఉండడం.. వారిని వేధించడం లాంటివి చేస్తున్నాడు. ఒంటరిగా అమ్మాయి కనబడితే బ్యాడ్ టచ్ చేసేవాడు. అంతేకాకుండా వారి కదలికలని కూడా వీడియోలు తీసేవాడు. అతని చెష్టలకి విసుగుచెంది విద్యార్థులు హెడ్మాస్టర్ కి ఫిర్యాదు చేసారు. ఆమే ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకువడమే కాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇష్టం లేకపొతే టీసీ ఇస్తామంటూ బెదిరించింది హెడ్మాస్టర్ కమల.. అయితే.. హెడ్మాస్టర్ కూడా యాకుబ్ పాషానే సపోర్ట్ చేయడంతో వాడు మరింత రెచ్చిపొయాడు.

నెలరోజులుగా అమ్మాయిల పట్ల మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక లాభం లేదని కొంతమంది విద్యార్థినులు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసారు. రంగంలోకి దిగిన అధికారులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు.. పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులొకి తీసుకున్నారు. యాకబ్ పాషా ఫోన్ తో పాటు ఇతర డాటాని పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ యాకుబ్ పాషాపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. ఈ సంఘటన గురించి తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహారించిన హెడ్మాస్టర్ కమలని సస్పెండ్ చేసారు.

ఇదిలాఉంటే.. ఈ సంఘటన పై ఆందోళనలు పెల్లుబికాయి. గంగాధరలో బిజేపి, బిఅర్ఎస్ అందోళన కార్యక్రమం నిర్వహించాయి.. నిందితులని కఠినంగా శిక్షించాలని పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు.. ఇదిలాఉంటే.. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పాఠశాల ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..