‘నాలాగా రెండు వేల మంది రీపోస్టు చేశారు.. వాళ్లందరిపైనా చర్యలు ఉంటాయా..?: స్మితా సబర్వాల్

పోలీసుల విచారణపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి ఏఐ ఫొటో రీట్వీట్‌పై పోలీసుల విచారణకు సహకరించానని స్మితా సబర్వాల్ సోషల్ మీడియా X వేదికగా పోస్ట్‌ చేశారు. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చానని స్మితా సబర్వాల్ చెప్పారు. ఆ పోస్ట్‌ను 2 వేల మంది రీపోస్ట్ చేశారన్నారు.

‘నాలాగా రెండు వేల మంది రీపోస్టు చేశారు.. వాళ్లందరిపైనా చర్యలు ఉంటాయా..?: స్మితా సబర్వాల్
Ias Officer Smita Sabharwal

Updated on: Apr 19, 2025 | 5:19 PM

పోలీసుల విచారణపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి ఏఐ ఫొటో రీట్వీట్‌పై పోలీసుల విచారణకు సహకరించానని స్మితా సబర్వాల్ సోషల్ మీడియా X వేదికగా పోస్ట్‌ చేశారు. పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చానని స్మితా సబర్వాల్ చెప్పారు. ఆ పోస్ట్‌ను 2 వేల మంది రీపోస్ట్ చేశారన్నారు. అందరిపైనా ఇదే యాక్షన్‌ ఉంటుందని అనుకుంటున్నట్లు ఈ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ అందరినీ విచారించకుంటే తనను కావాలనే టార్గెట్ చేసినట్టు అవుతుందన్నారు స్మితా సబర్వాల్.

IAS అధికారిణి స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియా Xలో రీ-ట్వీట్ చేయడంపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రాక్ దగ్గర గిబ్లీ ఇమేజ్‌తో జింకలు, నెమళ్లు ఉన్న..
AI ఫొటోను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణ సహాకరిస్తానంటూ పేర్కొన్నారు.

చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు అని విషయాలపై వివరణ ఇచ్చినట్లు చెప్పారు. తానలాగే రెండు వేల మంది రీపోస్టు చేశారని, వాళ్లందరిపైనా ఎలాంటి చర్య తీసుకుంటారు..? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా..? అని స్మితా సభర్వాల్‌ ప్రశ్నించారు. చూడాలి మరీ ఈ విషయం ఎందాకా దారి తీస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..