Telangana: కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలలో దారుణం.. చిన్నారిని రూమ్‌లో బంధించి..

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా.. అభం, శుభం తెలియని ఆరేండ్ల UKG విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు పాల్పడ్డాడు. తనను రూమ్‌లో బంధించి పీఈటీ టీచర్‌ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని..

Telangana: కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలలో దారుణం.. చిన్నారిని రూమ్‌లో బంధించి..
Kamareddy Case
Follow us

|

Updated on: Sep 24, 2024 | 6:25 PM

కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా.. అభం, శుభం తెలియని ఆరేండ్ల UKG విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు పాల్పడ్డాడు. తనను రూమ్‌లో బంధించి పీఈటీ టీచర్‌ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని.. చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిదండ్రులతోపాటు స్థానికులు స్కూల్‌కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం, స్థానికుల మధ్య వాదన జరిగింది.. అనంతరం ఒక్కసారిగా స్కూల్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

దీంతో పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ ఏర్పడింది.. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజ రామ్ గాయపడ్డారు. ఆందోళనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

కాగా.. నిందితుడు నాగరాజును అరెస్ట్‌ చేసి.. పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధు శర్మ ప్రకటించారు. పాఠశాలలో జరిగిన ఘటన పై విచారణ చేపడుతున్నామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..