“డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయా”: కడియం

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు సంచలన విషయాలు బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏమీ చేయలేకపోయానని కడియం అంగీకరించారు.

డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయా: కడియం
Kadiyam Srihari On Brs

Updated on: Jun 06, 2026 | 9:10 PM

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు సంచలన విషయాలు బయటపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏమీ చేయలేకపోయానని కడియం అంగీకరించారు. ఆ నాలుగేళ్లు తాను ఒక రకమైన ఉక్కపోతకు గురయ్యానని, డిప్యూటీ సీఎంగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, ఉమ్మడి వరంగల్ జిల్లా విభజన అంశాల్లో తాను కేసీఆర్‌తో విభేదించానని, కేసీఆర్ విద్యాశాఖను అస్సలు పట్టించుకునేవారు కాదని విమర్శించారు. రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు ఇబ్బందికరమే అయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉండి కేవలం అరవడం తప్ప ఏమీ చేయలేమని, అధికార పార్టీ సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కడియం శ్రీహరి కుండబద్దలు కొట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us