
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ఓ అలెర్ట్.. మీరు తరచుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లయితే.. ఇదిగో ఇది మీకోసమే. డిసెంబర్ 27న శనివారం నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ట్రైన్.. రెండు నిమిషాల పాటు హిందూపూర్‌లో ఆగనుంది. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. రైలు నెంబర్ 20703(కాచిగూడ–యశ్వంత్‌పూర్) మధ్యాహ్నం 12.08 గంటలకు హిందూపూర్ చేరుకుని 12.10 గంటలకు బయల్దేరనుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్‌లో రైలు నెంబర్ 20704(యశ్వంత్‌పూర్–కాచిగూడ) మధ్యాహ్నం 3.48 నుంచి 3.50 గంటల వరకు ఆగుతుంది.
ఈ ట్రయిల్ స్టాప్ హిందూపూర్ ప్రాంతంలోని ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసమేనని లక్ష్యంగా రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రైలు కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.మరోవైపు కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు నడవనుండగా.. బుధవారం ఒక్క రోజు ఉండదు. ప్రతీ రోజూ ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి.. కాచిగూడ రాత్రి 11 గంటలకు చేరుతుంది.
గుంతకల్లు డివిజన్ నుంచి కొత్త రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. గుంతకల్లు నుంచి డోన్ మీదుగా మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకు ఈ కొత్త రైలు నడవనుంది. రైలు నెంబర్ 57407 గుంతకల్లులో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి.. డోన్ మీదుగా రాత్రి 11.30 గంటలకు మార్కాపురం రోడ్డు స్టేషన్‌కు చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో 57408 నెంబర్‌తో రైలు.. మార్కాపురం రోడ్డు స్టేషన్ నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు బయల్దేరి.. ఉదయం 10.30 గంటలకు గుంతకల్లు చేరుతుంది. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబొట్ల, కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి