K A Paul: గవర్నర్ తమిళిసై ని కలిసిన కేఏ పాల్.. తెలంగాణ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..

|

Apr 13, 2022 | 5:08 PM

K A Paul: తెలంగాణ‌(Telangana) గవర్నర్‌ తమిళిసై(Tamilisai )తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం    భేటీ అయ్యారు. అనంత‌రం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ..

K A Paul: గవర్నర్ తమిళిసై ని కలిసిన కేఏ పాల్.. తెలంగాణ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..
Paul Meets Tamilisai
Follow us on

K A Paul: తెలంగాణ‌(Telangana) గవర్నర్‌ తమిళిసై(Tamilisai )తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం    భేటీ అయ్యారు. అనంత‌రం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమని.. అసలు తాను ఇప్పటి వరకూ ఇంత అవినీతి పాలన ఎప్పుడూ చూడలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.  రేపో మాపో సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం తప్పదన్నారు. అందుకనే కేటీఆర్ తో ఎప్పుడూ విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. కోట్ల అవినీతి పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయని మండిపడ్డారు. కేసీఆర్ అక్రమపాలన, అవినీతి పాలన అంతం చేయడానికే అమెరికా నుంచి తాను వచ్చినట్లు చెప్పారు.

లక్షల కోట్లు అప్పులు చేశారని.. అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. గవర్నర్ కు అండగా తాను.. తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతం చేయనున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కనీసం 30 సీట్లు కూడా గెలవదంటూ ప్రశాంత్ కిశోర్ చెప్పారని కేఏ పాల్ అన్నారు. తాను గతంలో ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సమయంలో అమెరికా అధ్యక్షులైన జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌లను హైదరాబాద్‌కు  తీసుకొచ్చానని అన్నారు. అంతేకాదు తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేన‌ని.. కేసీఆర్ విజయనగరం నుంచి వస్తే.. తాను వైజాగ్ నుంచి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై.. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ పరిస్థితులపై కూడా కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడున్న అప్పులు .. ఎవరు అధికారంలోకి వచ్చినా మరో ఇరవై ఏళ్ళు అయినా తీరడం కష్టమే నంటూ చెప్పారు. ప్రస్తుతం ఏపీ అంధకారంలో కి వెళ్ళిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : MuskMelon Juice: వేసవిలో ఈ జ్యూస్‌ ఎప్పుడైనా తాగరా.. నిజంగా అమృతమే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

Ayurveda Tips: ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయా.. కాలిష్యం లోపం ఉన్నట్లే.. ఈ 4 ఆహారపదార్ధాలతో కాల్షియాన్ని పెంచుకోండి