తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి నెలకొంది.. ప్రధాన పార్టీలన్నీ హైస్పీడుతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నేతలు మాటల తూటాలు పేలుస్తూ.. మరింత రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. దీంతో అంతటా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణలో కేఏ పాల్.. ఎంటరయ్యారు. తెలంగాణలో పాల్ అన్న పాలన రాబోతోంది.. ప్రజాశాంతి పార్టీ 79 సీట్లు గెలవబోతోంది.. అంటూ కేఏ పాల్ టీవీ9 తో పేర్కొన్నారు. తనకు 60శాతం ప్రజల మద్దతు ఉందని.. ప్రజాశాంతి పార్టీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే 18మంది అభ్యర్ధుల్ని ప్రకటించాం, రేపు మిగతా 101మందిని ప్రకటిస్తానన్నారు. తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి కాబోతున్నానని.. పెన్షన్‌ను రూ.6వేలు చేస్తా, రైతుబంధు రూ.20వేలు చేస్తా అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతోందని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కాదు… ప్రజాశాంతి పార్టీనే ఫస్ట్ ఫోర్స్.. అంటూ పేర్కొన్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివాళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరండి… నేను ఎమ్మెల్యేలుగా చేస్తా.. అంటూ పిలుపునిచ్చారు.
విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపిన కేఏ పాల్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తారంటూ పేర్కొన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటానని.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తు ఉండొచ్చంటూ జోస్యం చెప్పారు. చంద్రబాబుతో అయినా కలిసి వెళ్తాం.. అంటూ కేఏ పాల్ స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..