నక్సల్స్‌కు సింహస్వప్నం రోలో జాగిలం ఇక లేదు! ఎన్‌కౌంటర్‌లో తేనెటీగల దాడిలో మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న CRPFకు చెందిన బెల్జియన్ మాలినోయిస్ జాగిలం ‘రోలో’ తేనెటీగల దాడిలో మృతి చెందింది. నక్సలైట్ల రహస్య స్థావరాలను వెతుకుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన రోలో చికిత్స పొందే లోపు మరణించింది.

నక్సల్స్‌కు సింహస్వప్నం రోలో జాగిలం ఇక లేదు! ఎన్‌కౌంటర్‌లో తేనెటీగల దాడిలో మృతి
Crpf Dog Rolo Death

Updated on: May 16, 2025 | 5:31 PM

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ రహస్య స్థావరాలు, పేలుడు పదార్థాల కోసం వెతుకుతూ CRPFకు చెందిన జాగిలం తేనెటీగల దాడిలో అమరుడైంది. కర్రెగుట్ట కొండలలో సీఆర్‌పీఎఫ్‌, నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో బెల్జియన్ మాలినోయిస్ K9 రోలో అనే జాగిలం బలైంది. తేనెటీగలు కుట్టడం వల్ల తీవ్రంగా గాయపడి మృతిచెందింది.

ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులో నక్సలైట్లపై జరిగిన 21 రోజుల భారీ దాడుల్లో CRPF, ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో K9 రోలో భాగమైంది. ఆ బృందం నక్సల్స్‌ను వెతికి చంపుతుండగా కొండల అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. వారి దాడిలో రోలో తీవ్రంగా గాయపడి చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించింది. ఏప్రిల్ 2024లో ఈ జాగిలాన్ని నక్సల్ వ్యతిరేక విధుల కోసం CRPF 228వ బెటాలియన్‌కు పంపారు. రోలో మరణానంతరం ప్రశంసా డిస్క్‌తో సత్కరించాలని నిర్ణయించారు.

రోలో అంత్యక్రియలకు ముందు గౌరవ వందనం సమర్పించారు. రోలో సైనికుడిగా పనిచేశాడు. అతను నక్సలైట్ రహస్య స్థావరాలను, పేలుడు పదార్థాలను కనుగొనడంలో నిపుణుడు. కాగా రోలోను తేనెటీగల దాడి నుండి రక్షించడానికి, అతని హ్యాండ్లర్ ప్లాస్టిక్ షీట్‌తో కప్పాడు, కానీ తేనెటీగలు షీట్‌లోకి ప్రవేశించి కుట్టాయి. ఆ నొప్పితో రోలో ప్లాస్టిక్ షీట్‌ను తొలగించింది. దీని వలన మరిన్ని తేనెటీగలు జాగిలంపై దాడి చేశాయి. వందలాది తేనెటీగల దాడిలో రోలో తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందేలోపే మరణించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి