Telangana Politics: ఆ పార్టీలో మనుషులుగా కూడా చూడటం లేదు.. అందుకే పార్టీ మారుతున్నామన్న జూపల్లి

|

Jun 26, 2023 | 6:56 PM

Jupally Krishna Rao: ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేశారు. నాడు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చాక మా అందచనాలన్నీ తపాయన్నారు. ప్రశ్నించే గొంతుకే ఉండవద్దని కేసీఆర్ భావిస్తున్నారని..

Telangana Politics: ఆ పార్టీలో మనుషులుగా కూడా చూడటం లేదు.. అందుకే పార్టీ మారుతున్నామన్న జూపల్లి
Jupally Krishna Rao
Follow us on

ఢిల్లీ, జూన్ 26: కేసీఆర్ పాలనంతా బోగస్ మాటలు, పథకాలతో సాగుతోందని విమర్శించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. మీడియాతో జూపల్లి మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేశారు. నాడు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చాక మా అందచనాలన్నీ తపాయన్నారు. ప్రశ్నించే గొంతుకే ఉండవద్దని కేసీఆర్ భావిస్తున్నారని.. కేసీఆర్ తీరు అంబేడ్కర్‌ను అవమానించేలా ఉందన్నారు జూపల్లి.

దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి పరాకాష్టకు చేరిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా మనుషులుగా చూడలేని పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉందన్నారు.

ఈసారి కాంగ్రెస్‌కి అధికారం ఇవ్వకుపోతే దేవుడు కూడా క్షమించడు.. అందుకే కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకున్నామన్నారు జూపల్లి కృష్ణారావు. వచ్చే నెల 14 లేదా 16న రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటిచారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్‌లో చేరుతాం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం