
జూబ్లీహిల్స్ బైపోల్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పోల్చుతూ జరుగుతున్న ఉప ఎన్నికనా? రేవంత్ రెడ్డి పనితీరుకు, కేసీఆర్ పాలనాతీరుకు మధ్య పోలికను చూపించే బైఎలక్షనా? నిజానికి, ఏ ఉప ఎన్నిక కూడా రాష్ట్ర పాలనా తీరుకు మిర్రర్ కాదు. గత పదేళ్లను, ఈ రెండేళ్లను పోల్చడమూ కుదరదు. బట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అలా పోల్చేదాకా తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్‌తో అటాచ్‌మెంట్ లేని అంశాలను కూడా తీసుకొచ్చి ప్రచారానికి వాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవడమే కాదు.. మోస్ట్ ప్రెస్టేజియస్‌గా చూస్తున్నాయి పార్టీలు. కారణం.. ఈ నియోజకవర్గం హైదరాబాద్‌లో ఉండడం. అధికార కేంద్రానికి దగ్గరగా ఉండడం. జూబ్లీహిల్స్‌లో బస్తీల నుంచి మల్టీస్టెయిర్ బిల్డింగుల వరకు, సెలబ్రిటీల నుంచి స్లమ్ పీపుల్ వరకు.. అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఇక్కడ వచ్చే రిజల్ట్.. స్టేట్ పల్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంత ప్రతిష్టాత్మకం. పైగా పార్టీలు, పార్టీల్లోని కీలక నేతలకు ఈ ఉప ఎన్నిక చావో రేవో అన్నంత పరిస్థితి. కాంగ్రెస్ గెలిస్తే పనితీరు బాగుందని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టు. బీఆర్ఎస్ గెలిస్తే గత పదేళ్ల పాలనతో పోల్చుకున్నట్టు. బీజేపీ గెలిస్తే.. ప్రత్యామ్నాయం కింద లెక్కగట్టినట్టు. అందుకే, పార్టీలకు ఇది ప్రేస్టేజియస్. అలాగే.. నేతలకు కూడా కీలకం ఈ ఉప ఎన్నిక. జనరల్‌గా ముఖ్యమంత్రులు ఒక బైఎలక్షన్‌లో ప్రచారం చేయడం అరుదు. అందునా, భారీ షెడ్యూల్ రూపొందించుకుని...