Jubilee Hills Election Result 2023: అజారుద్దిన్‌ జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా..?

Jubilee Hills Assembly Election Result 2023 Live Counting Updates: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా ఖైరతాబాద్‌‌కు పేరుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పేరు చెబితే పీజేఆర్‌ పి.జనార్దన్‌రెడ్డి పేరు గుర్తొస్తుంది. 2007లో పీజేఆర్‌ హార్ట్ అటాక్‌తో అకస్మాత్తుగా చనిపోవడంతో.. అనంతరం జరిగిన బై ఎలక్షన్‌లో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నికయ్యారు.

Jubilee Hills Election Result 2023: అజారుద్దిన్‌ జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా..?
Brs Vs Congress

Edited By:

Updated on: Dec 03, 2023 | 11:00 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా ఖైరతాబాద్‌‌కు పేరుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం పేరు చెబితే పీజేఆర్‌ పి.జనార్దన్‌రెడ్డి పేరు గుర్తొస్తుంది. 2007లో పీజేఆర్‌ హార్ట్ అటాక్‌తో అకస్మాత్తుగా చనిపోవడంతో.. అనంతరం జరిగిన బై ఎలక్షన్‌లో ఆయన కుమారుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో… విష్ణువర్ధన్‌రెడ్డి  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం (Jubilee Hills Assembly Election) నుంచి పోటీ చేసి, గెలుపొందారు. ఇక.. 2014, 2018 ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విష్ణువర్ధన్‌రెడ్డి ఓటమి చెందారు. వరసగా మాగంటి గోపినాథ్ విజయం సాధిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపినాథ్‌కు 68,979 ఓట్లు పడగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణుకు 52,975 ఓట్లు పడ్డాయి. 16,004 ఓట్ల మెజార్టీతో గోపినాథ్ విజయం సాధించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

బడా రాజకీయ నేతలు, బిలియనీర్లు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, సెటిలర్స్‌లతో పాటు పేద వర్గాలకు చెందిన ప్రజలు కూడా జూబ్లిహిల్స్‌లో నివశిస్తూ ఉంటారు. ఈ సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సీటు ఇచ్చింది బీఆర్‌ఎస్. అటు కాంగ్రెస్ అనూహ్యంగా అజారుద్దిన్‌ను బరిలోకి దించింది. మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్‌ పేరు ప్రకటించింది. దీంతో హర్టయిన విష్ణువర్థన్ గులాబీ కండువా కప్పుకున్నారు. అటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహ్మద్‌ అజారుద్దీన్‌ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తరప్రదేశ్‌ మురాదాబాద్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతమేర ప్రభావం చూపుతారో చూడాలి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్