Pawan Kalyan vs Posani : పోసానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు.. రాష్ట్ర బహిష్కరణ చేయాలంటూ..

|

Oct 01, 2021 | 7:50 PM

Pawan Kalyan vs Posani Murali Krishna: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై జనసేన వీర మహిళా విభాగం నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేశారు.

Pawan Kalyan vs Posani : పోసానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు.. రాష్ట్ర బహిష్కరణ చేయాలంటూ..
Janasena
Follow us on

Pawan Kalyan vs Posani Murali Krishna: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై జనసేన వీర మహిళా విభాగం నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. పవన్ అభిమానుల మనోభావాలను దెబ్బ తీస్తున్న పోసాని కృష్ణ మురళీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు మహిళా విభాగం నేతలు. హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన వీరు.. పోసాని కృష్ణ మురళీ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలే తప్ప కుటుంబాల జోలికి వెళ్లడం సరికాదన్నారు. తాము వ్యక్తి గతంగా ఎలాంటి దాడులు చేయలేదన్నారు.

పోసాని ఇంటిపై రాళ్ల దాడికి, తమకు ఏలాంటి సంబంధం లేదని జనసేన వీర మహిళా విభాగం నేతలు స్పష్టం చేశారు. దాడులు, వ్యక్తిగత దూషణలు చేయడం సంప్రదాయం కాదన్నారు. తాము నిజాయితీగా.. నిబద్దతతో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. పోసాని కృష్ణ మురళీ చేసిన వాఖ్యలు స్త్రీ లను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పోసానిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని హెచ్ఆర్‌సీని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పోసానిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని జనసేన వీర మహిళా విభాగం నేతలు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పోసానిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని జనసేన వీర మహిళా విభాగం నేతలు కోరారు.

Also read:

Looted Eggs: లారీని చోరీ చేసిన దుండగులు.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Huzurabad By Election: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Love Story Magical Celebrations: లవ్ స్టోరీ మ్యాజికల్ సెలబ్రేషన్ లైవ్ వీడియో