MLA JAGGAREDDY: ఆయనో ఎమ్మెల్యే.. ఆయన కొన్ని ఆవులను సాకుతున్నారు. అయితే ఉన్నపళంగా అవి ఒక రోజు కనిపించ లేదు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసి కూడా నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో సదరు ఎమ్మెల్యే నేడు ఏకంగా డీజీపీకే ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. తాను సాకుతున్న ఆరు ఆవులను దుండగులు దొంగిలించారంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దూడలను ఉంచి ఆవులను ఎత్తుకెళ్లారన్నారు. ఆవుల చోరీ గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఫలితం లేదన్నారు. తన ఆవులను ఎవరు దొంగిలించారో కనిపెట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డిని జగ్గారెడ్డి కోరారు. ఆ మేరకు విజ్ఞప్తి చేస్తూ వీడియోను విడుదల చేశారు. అయితే తన ఆవులు మాయం అవడం వెనుక అవుల అక్రమ రవాణా ముఠా ప్రమేయం ఉండొచ్చని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు. మేతకు వదిలిన పశువులను దుండగులు అపహరించి కబేళాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తన ఆవులే కాదని, చాలా మంది ఆవులు ఇలా మాయం అవుతున్నాయని వీడియోలో జగ్గారెడ్డి వివరించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఎమ్మెల్యే కోరారు.
Also read:
బాక్సింగ్ డే టెస్టు: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రాహుల్‌కు మరోసారి నిరాశే..
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం సన్నాహాలు.. ఈనెల 28,29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్