Telangana BJP: రంగంలోకి ఆ ఎమ్మెల్యేలు.. సైలెంట్‌గా పనిచేసుకెళ్తున్న కాషాయ పార్టీ దళం.. స్ట్రాటజీ అదేనా..?

Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. పోలింగ్‌కు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు మొత్తం ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి.. వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ పార్టీ) సర్వశక్తులూ ఒడ్డుతోంది..

Telangana BJP: రంగంలోకి ఆ ఎమ్మెల్యేలు.. సైలెంట్‌గా పనిచేసుకెళ్తున్న కాషాయ పార్టీ దళం.. స్ట్రాటజీ అదేనా..?
Telangana BJP

Edited By:

Updated on: Nov 16, 2023 | 4:21 PM

Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. పోలింగ్‌కు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు మొత్తం ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి.. వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ పార్టీ) సర్వశక్తులూ ఒడ్డుతోంది.. ఓ వైపు సీఎం కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రోజుకి మూడు నాలుగు సభలతో ప్రజలకు చేరువవుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ను ఉపయోగించుకుని ఇంటర్వ్యూలు, పలు కార్యక్రమాలు చేస్తున్నారు. హరీష్ రావు లోకల్ మీటింగ్ లతోపాటు కుల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాహుల్, ప్రియాంకను సైతం రంగంలోకి దింపుతున్నారు. జాతీయ నాయకత్వం కూడా ఇక్కడే ఉంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. ప్రచారం చివరి క్షణాల్లో సోనియాగాంధీని కూడా రంగంలోకి దించాలని చూస్తున్నారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కూడా యాక్టివ్గా అన్ని ప్రసార మాధ్యమాలను ఎంచుకొని ప్రచారం చేస్తోంది.

భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే.. పార్టీ నాయకత్వం సైలెంట్ స్టడీని మొదలుపెట్టింది. ఎన్నికలు రాకముందే జాతీయ నాయకత్వం పూర్తి సన్నాహాలు చేసింది. నాయకత్వం మార్పు జరిగిన దగ్గర నుంచి ప్రజానాడి తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ తెప్పించుకుంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ప్రధాని మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి మహామహులతో ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే ఇవన్నీ చేస్తూనే మరొక సీక్రెట్ ఆపరేషన్ కి బీజేపీ తెరలేపింది.

119 నియోజకవర్గాల్లో సీక్రేట్ ఆపరేషన్ కొనసాగనుంది. దీనికిగాను ఇతర రాష్ట్రాల్లో గెలిచిన బిజెపి ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. కర్ణాటక, రాజాస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పాగా వేశారు. నామినేషన్ల నుంచి ఎన్నికల ముగిసే వరకు ఇక్కడే ఉండి పార్టీ గెలిపించడానికి తీసుకోవాల్సిన స్ట్రాటజీపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. అయితే, ఈ అంశాన్ని ఎక్కడ కూడా బయటికి రానియ్యకుండా చాలా గొప్యంగా పనిచేసుకుంటూ బీజేపీ టీం ఎప్పటికప్పుడు అధిష్టానానికి రిపోర్టును చేరవేస్తోంది.

అందుకేనేమో సోషల్ మీడియాలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగిస్తున్నా… బీజేపీ మాత్రం డోర్ టూ డోర్ ప్రచారాన్నే నమ్ముకుంది. తమ ఎమ్మెల్యేలను రాష్టంలో దించి సైలెంట్ గా గెలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..