Telangana: అదిరిందయ్యా ఐడియా..! బైక్‌పై వెళ్లేవారికి ఎండ, వాన నుంచి రక్షణ ఇలా..

కారు.. ఫోర్ వీలర్స్ లాంటి వాహనాల్లో ప్రయాణిస్తే ..వాన, ఎండ నుండి రక్షణ పొందవచ్చు. కానీ సైకిల్, టూ వీలర్స్‌పై వెళ్తే ఎండలో ఎండడం..

Telangana: అదిరిందయ్యా ఐడియా..! బైక్‌పై వెళ్లేవారికి ఎండ, వాన నుంచి రక్షణ ఇలా..
Telangana

Edited By: Ravi Kiran

Updated on: Jul 17, 2023 | 12:31 PM

కారు.. ఫోర్ వీలర్స్ లాంటి వాహనాల్లో ప్రయాణిస్తే ..వాన, ఎండ నుండి రక్షణ పొందవచ్చు. కానీ సైకిల్, టూ వీలర్స్‌పై వెళ్తే ఎండలో ఎండడం.. వర్షంలో తడవడం ఖాయం. మరీ ముఖ్యంగా బైక్‌పై ప్రయాణించే సమయంలో ఎండ, వాన నుంచి రక్షణ పొందడానికి ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. తన ఐడియాతో టూ వీలర్స్‌పై ప్రయాణించే వారికి వాన, ఎండ నుంచి రక్షణ కలుగుతోంది.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన చిట్టిప్రోలు అశోక్.. నిత్యం వ్యాపారం ఇతర అవసరాల కోసం టూ వీలర్‌పై ప్రయాణం సాగిస్తుంటాడు. కొన్నిసార్లు ఎండా, వానలతో ఇబ్బంది పడుతున్నాడు. దీని నుంచి ఎలా రక్షణ పొందాలనే ఆలోచన చేశాడు. తన హోండా యాక్టివాకు గొడుగు బిగించేలా డిజైన్ చేశాడు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనకాల కూర్చునే వ్యక్తికి కూడా ఎండ, వాన రక్షణ కలిగేలా గొడుగుని రూపొందించాడు. ఈ గొడుగుతో చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అశోక్ తిరుగుతుండగా స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆలోచన అదిరిందయ్యా.. అశోకూ అంటూ అందరూ అభినందించారు.