Revanth Reddy Political Profile: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ సీఎల్పీ నేతగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపింది. అయితే, రేవంత్ రెడ్డి పేరును సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి.. 1969 నవంబరు 8న జన్మించారు. తండ్రి పేరు దివంగత అనుముల నర్సింహ రెడ్డి.. తల్లి అనుముల రామచంద్రమ్మ. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డికి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు. రేవంత్ రెడ్డి, గీత దంపతులకు ఒక కుమార్తె ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..