Telangana: ఆమె ఇంటర్.. అతడు 9వ తరగతి.. ప్రేమించుకున్నారు.. ఆపై శారీరికంగా కలిశారు.! కట్ చేస్తే

వనపర్తి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వయసు బేధం లేకుండా ప్రేమలు, ఆ తర్వాత దగ్గరవడాలు. అర్థం, పర్థం లేకుండా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాఠశాల విద్య ఇంకా పూర్తికాకముందే తండ్రయ్యాడు ఓ విద్యార్థి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Telangana: ఆమె ఇంటర్.. అతడు 9వ తరగతి.. ప్రేమించుకున్నారు.. ఆపై శారీరికంగా కలిశారు.! కట్ చేస్తే
Representative Image 1

Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2025 | 2:01 PM

వనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న అమ్మాయి, అదే గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న అబ్బాయి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో ఇద్దరు పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో సదరు బాలిక గర్భం దాల్చింది. విషయం గమనించిన తల్లితండ్రులు మైనర్ బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం తల్లితండ్రులకు తెలిపింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరు మైనర్‌లు కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

అయితే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు అమ్మాయి తల్లితండ్రులు. బాలుడిని, తల్లితండ్రులను పిలిపించారు. అయితే తమ కుమారుడికి ఈ ఘటనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నిండు గర్భిణి కావడంతో.. బాలిక డెలివరీ తర్వాత బిడ్డకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలని బాలిక తల్లితండ్రులు, గ్రామస్థుల నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ పెళ్లి చేయాల్సి వచ్చినా ఇద్దరు మేజర్‌లు అయ్యాకే కుదురుతుందన్న చర్చ జరిగింది. అయితే పంచాయితీలో ఏమి తేలకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

సీన్ కట్ చేస్తే.! ఈ నెల 14న ఆడబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. బిడ్డ పుట్టి 15 రోజుల గడుస్తున్నా బాలుడి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మరోసారి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. నేరుగా వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని కలవాలని కార్యాలయానికి చంటి బిడ్డతో వెళ్లారు. అక్కడ ఎస్పీ సునీత రెడ్డిని అందుబాటులో లేకపోవడంతో ఇతర పోలీసు అధికారులను కలిసి విషయం చెప్పారు. పుట్టిన బిడ్డకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాలిక, ఆమె తల్లితండ్రులు కోరుతున్నారు.