Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారా..? మొబైల్ నెంబర్‌తో సెకన్లలోనే స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఒక్క క్లిక్‌తోనే..

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. దశలవారీగా ఈ స్కీమ్ అమలు చేస్తోంది. తొలి విడతలో కొంతమందికి ఇళ్లను మంజూరు చేయగా.. రెండో విడత ఇళ్ల మంజూరు కూడా సిద్దమవుతోంది. అయితే ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు చూద్దాం.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారా..? మొబైల్ నెంబర్‌తో సెకన్లలోనే స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఒక్క క్లిక్‌తోనే..
Indiramma Houses

Updated on: Sep 03, 2026 | 11:37 AM

సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ప్రతీఒక్క పేదవాడి చిరకాల కల. తమకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలని అందరూ అనుకుంటారు. దీనిని సాధించుకునేందుకు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మొత్తం ధారపోస్తారు. అయితే పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా స్థలం ఉండి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఆర్ధిక సాయం అందిస్తోంది. ఏకంగా రూ.5 లక్షల సాయం ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందాలంటే అర్హతలు ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అవసరమైన పత్రాలు ఏంటి? ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇందిరమ్మ ఇళ్లకు అర్హతలు ఇవే..

-తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి

-దారిద్య్ర రేఖకు దిగవున ఉండాలి. బీపీఎల్ కుటుంబాలు మాత్రమే దీనికి అర్హులు

-సొంత ఇల్లు కలిగి ఉండకూడదు

-ఇప్పటివరకు ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద లబ్ది పొంది ఉండకూడదు

-రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి

-కుటుంబ ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి

-ఒంటరి, వితంతు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు

-గుడిసెలు, తాత్కాలిక ఇళ్లల్లో నివాసం ఉంటున్నవారికి తొలి ప్రాధాన్యత కల్పిస్తారు

-దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఇతర బలహీన వర్గాల ప్రజలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

-రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, సొంత స్థలం ఉంటే భూమి యాజమాన్య పత్రాలు, పాస్ పోస్ట్ సైజు ఫొటో

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాలు, మడల కార్యాలయాల ద్వారా ప్రజా పాలన దరఖాస్తులు పొంది వాటిని నింపాలి. అనంతరం ఎమ్మార్వో లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులో లేదు. ఇతర వివరాలు తెలుసుకునేందుకు https://indirammaindlu.telangana.gov.in/ పోర్టల్ చూడవచ్చు.

ఆన్‌లైన్‌లో అప్లికషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

అయితే ఆన్‌లైన్‌లో ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే మార్గం అందుబాటులో ఉంది. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్ సైట్ తెరవాలి. అందులో అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఆధార్, మొబైల్, రేషన్ కార్డు, అప్లికేషన్ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇతర సందేహాలకు 040-29390057 టల్ ఫ్రీ నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us