Indigo Airlines: హైదరాబాద్ – బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్.. అందుబాటులోకి ఎప్పుడంటే..

ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 2024 ఫిబ్రవరి 26 నుంచి హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆగ్నేయాసియా ప్రాంతంతో క్యారియర్ కనెక్టివిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రెండు గొప్ప గమ్యస్థానాల మధ్య ఈ ముఖ్యమైన లింక్‌ను ఏర్పాటు చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా సరికత్త రికార్డ్ సాధించింది.

Indigo Airlines: హైదరాబాద్ - బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్.. అందుబాటులోకి ఎప్పుడంటే..
Indigo

Updated on: Jan 29, 2024 | 8:42 PM

ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 2024 ఫిబ్రవరి 26 నుంచి హైదరాబాద్, బ్యాంకాక్ మధ్య డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆగ్నేయాసియా ప్రాంతంతో క్యారియర్ కనెక్టివిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రెండు గొప్ప గమ్యస్థానాల మధ్య ఈ ముఖ్యమైన లింక్‌ను ఏర్పాటు చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా సరికత్త రికార్డ్ సాధించింది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ప్రయాణాలకు కీలకమైన కేంద్రంగా మారడంతో అంతర్జాతీయ గమ్యస్థానాలకు హైదరాబాద్ కనెక్టివిటీ మరింత విస్తరించింది. గ్లోబల్ ఏవియేషన్ నెట్‌వర్క్‌లో అత్యున్నత స్థాయిని, హోదాను సాధించుకుంది. ఇక ఇండిగో విషయానికొస్తే..సంవత్సరంలోనే దాని గ్లోబల్ కనెక్టివిటీని ఎనిమిది ప్రపంచ గమ్యస్థానాల నుండి 14 ప్రపంచ గమ్యస్థానాలకు విస్తరించుకుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతాతో సహా ప్రధాన నగరాల నుంచి బ్యాంకాక్‌కు అనుసంధానించే బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇదే తరుణంలో మరో కనెక్టివిటీని హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయడం విశేషం. నివేదికల ప్రకారం, ఇండిగో ఈ కొత్త మార్గాలతో ఇండియా – బ్యాంకాక్ మధ్య మొత్తం 37 వారపు విమానాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్ట్‎గా థాయ్ రాజధానికి అనుసంధానించబడిన ఆరవ భారతీయ నగరంగా హైదరాబాద్ కు చోటు దక్కడం గర్వకారణం. ఇండిగోలో గ్లోబల్ సేల్స్ హెడ్, మిస్టర్ వినయ్ మల్హోత్రా ఈ అభివృద్ధి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆగ్నేయాసియా అంతటా తమ సేవలను విస్తరించేందుకు అనుగుణంగా, హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వరకు మా కార్యకలాపాలను ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము.” అని ట్వీట్ చేశారు. ఈ కనెక్టివిటీకి హైదరాబాద్ వేదిక అవడం చాలా ఆనందంగా ఉందని తన భావనను వ్యక్తపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..