ఆ నగరానికి ఏమైందీ? వారానికో హత్య.. ఆరు నెలల్లో మొత్తం 24 ఖూనీలు..!

గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్యలన్నీ ఆ నగరంలోనే జరిగాయి కాబట్టి. అందునా.. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌ తరువాత అతిపెద్ద నగరం అది. ఆ సిటీ పేరు.. ఓరుగల్లు. హైదరాబాద్-సికింద్రాబాద్‌ జంటనగరాలైతే.. వరంగల్-హన్మకొండ-కాజీపేట్ ట్రైసిటీ. తెలంగాణకు అన్‌అఫీషియల్‌ క్యాపిటల్‌గా చూస్తుంటారు ఈ ఏకశిలానగరాన్ని.

ఆ నగరానికి ఏమైందీ? వారానికో హత్య.. ఆరు నెలల్లో మొత్తం 24 ఖూనీలు..!
Crime News

Updated on: Feb 21, 2025 | 8:54 PM

తెలుగు రాష్ట్రాల్లో హత్యాకాండ సిరీస్‌ నడుస్తోందా అనే అనుమానం వస్తోంది ఈ వరుస ఘటనలు చూసి  వరుస హత్యలు, హత్యాయత్నాలు చెరగని రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. ఓరుగల్లులో బరితెగిస్తున్న దుండగులు నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. కత్తులు కోలాటం చేస్తున్నాయి. ఆ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిలుస్తున్నాయి. ఎవర్ విక్టోరియస్‌కు ఏమైంది..? నేరాల నియంత్రణలో ఎందుకలా ఢీలా పడుతున్నారు..? తాజా ఘటనలతో మరోసారి వణుకు పుట్టిస్తోంది ఓరుగల్లు రక్త చరిత్ర. వరంగల్ నగరంలో పోలీసులంటే నేరస్తులకు భయం తగ్గిందో..? లేక నేరస్తులు యాక్టివ్ అయ్యారో.. ఏమో కానీ హత్యలు హ అత్యాయత్నాల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజలకు వణుకు పుట్టిస్తుంది. గత ఏడాది 35 హత్యలు..102 హత్యాయత్నం ఘటనలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2025 సంవత్సరం లో కూడా హత్యలు.. హత్యా యత్నాల పరంపర కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే మూడు వరుస హత్యాయత్నాల ఘటనలు ఓరుగల్లు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. వరంగల్ నగరంలోని వాసవి కాలనీకి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన బార్య అనితపై మటన్ నరికే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్తామామ తోపాటు తన కూతురుపై కూడా అదే కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామంలో మరో ఘటన జరిగింది.. పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఈ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి