Student Missing Mystery: ప్రమాదవశాత్తు నీళ్లలో పడ్డారా? లేక ఎవరైనా.. ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యార్థినిల మిస్సింగ్ మిస్టరీ..

Lakshmipur Reservoir: ప్రమాదవశాత్తు పడిపోయారా.. లేక ఆత్మహత్యయత్నం చేశారా.. ఇంకా ఏమైనా కారణాలున్నాయా తేలడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Student Missing Mystery: ప్రమాదవశాత్తు నీళ్లలో పడ్డారా? లేక ఎవరైనా.. ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యార్థినిల మిస్సింగ్ మిస్టరీ..
Lakshmipur Reservoir

Updated on: Sep 08, 2022 | 8:04 PM

ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపూర్‌ రిజర్వాయర్‌లో విద్యార్థుల గల్లంతు ఘటన మిస్టరీగా మారింది. రిజర్వాయర్ లో పడి ఒక విద్యార్థిని మరణించగా.. మరో విద్యార్థిని అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు రిజర్వాయర్ కు ఎందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు పడిపోయారా.. లేక ఆత్మహత్యయత్నం చేశారా.. ఇంకా ఏమైనా కారణాలున్నాయా తేలడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఇవ్దర్నీ జైనాథ్‌కు చెందిన టెన్త్‌ విద్యార్ధీనీలుగా గుర్తించారు. కోలుకున్న అమ్మాయిని ఆరా తీశారు పోలీసులు. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయినట్టు చెప్పారామె. కానీ వాళ్లిద్దరి దగ్గర ఫోన్స్‌ లేకపోవడం ..రెండు కి.మీ దూరం కాలినడక వెళ్లడం.. ఓ అమ్మాయి స్కూల్‌ బ్యాగ్‌ రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో పడి వుండడం అనుమానాలకు తావిచ్చింది. అసలేం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. త్వరలోనే నిజానిజాలు తేలుస్తామన్నారు.

సరదా కోసం రిజర్వాయర్‌కు వెళ్లి సెల్ఫీ తీసుకునే క్రమంలోనే ప్రమాదవశాత్తు జారిపడ్డారా? లేక మరేదైనా కోణం ఉందా? అనేది ఇక దర్యాప్తులో తేలాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం