Telangana: యూరినల్ ప్రాబ్లమ్స్‌తో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. కడుపులో వింత.. కంగుతిన్న వైద్యులు..!

|

Aug 21, 2022 | 6:16 PM

Telangana: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్‌లో వింత ఘటన వెలుగు చూసింది. వ్యక్తి కడుపులో కరోనా వైరస్ ఆకారంలో

Telangana: యూరినల్ ప్రాబ్లమ్స్‌తో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. కడుపులో వింత.. కంగుతిన్న వైద్యులు..!
Doctors
Follow us on

Telangana: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్‌లో వింత ఘటన వెలుగు చూసింది. వ్యక్తి కడుపులో కరోనా వైరస్ ఆకారంలో ఉన్న రాయి బయటపడింది. అది చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి యూరినల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాడు. చాలా చోట్ల చూపించుకుని మెడిసిన్స్ వాడాడు. చివరకు జిల్లా కేంద్రంలోని మదర్ హుడ్ ఆస్పత్రిలో చేరాడు. రోగిని పరిశీలించిన వైద్యులు.. అతనికి యూరినల్ ప్రాబ్లం ఉందని, సర్జరీ చేయాలని సూచించారు. ఆ సలహా ప్రకారం.. వైద్యులు రాజేష్ అతనికి సర్జరీ చేశారు. అయితే, రోగి శరీరంలో కరోనా వైరస్ ఆకారాన్ని పోలిన రాయి కనిపించింది. అది చూసి వైద్యులే అవాక్కయ్యారు. ఆ రాయి అచ్చం కరోనా వైరస్‌ ఉన్నట్లుగానే ఉండటం విశేషం. ఆ వింత రాయిని ప్రదర్శించారు. కడుపులో రాయి ఇలా ఉండటం అరుదైన విషయం అని పేర్కొన్నారు వైద్యులు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. ఇదివరకెప్పుడూ ఇలాంటి వింత రాయిని చూడలేదన్నారు. యూరినల్ ప్రాబ్లమ్‌తో పేషెంట్ తమ వద్దకు వచ్చాడని, స్కానింగ్ చేస్తే రాయి ఉన్నట్లు కనిపించిందన్నారు. దాంతో ఆపరేషన్ చేశామన్నారు. అయితే, ఆపరేషన్ సమయంలో వింత రాయి బయటపడం చూసి ఆశ్చర్యపోయామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..