Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో

|

Oct 09, 2024 | 12:39 PM

తెలంగాణకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
Weather Report
Follow us on

తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, బి. కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్‌కు IMD ఎల్లో అలెర్ట్ జారీ చేయనప్పటికీ, అక్టోబర్ 12 వరకు నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. లా నినా పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్ మాసాల్లో చలి తీవ్రత ఓ రేంజ్‌లో ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

లా నినా, ఎల్ నినో అంటే ఏంటి?

లా నినా వలన పసిఫిక్ మహాసముద్రంపైన భూమధ్యరేఖ వెంబడి వీచే గాలులు, అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమాన ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే తీవ్రంగా ఉంటాయి. ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకు వెచ్చటి నీటిని తీసుకొస్తాయి. దాంతో, సముద్రమట్టాలు జోరందుకుంటాయి. అవతల అమెరికా వైపు చల్లచల్లని వాటర్ ఉపరితలం పైకి వస్తుంది.  ఎల్ నినో దశలో దీనికి విరుద్దంగా జరుగుతుంది. వెచ్చటి నీరు అమెరికా వైపుకు మళ్లుతుంది. ఆసియా వైపు చల్లటి నీరు సముద్ర ఉపరితలం మీదకు వస్తుంది. ఒక రకంగా లా నినా అతివృష్టి, ఎల్ నినో అనావృష్టి చెప్పవచ్చు. IMD అక్టోబర్-నవంబర్ నాటికి లా నినా పరిస్థితులను అంచనా వేసినందున, హైదరాబాద్ ఈ సంవత్సరం కఠినమైన శీతాకాలాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.