AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్‌లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..

పేరుకే యూట్యూబర్‌.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి.

Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్‌లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
Jyoti Malhotra
Shaik Madar Saheb
|

Updated on: May 19, 2025 | 1:06 PM

Share

పేరుకే యూట్యూబర్‌.. కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరాతీస్తున్నాయి. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్‌కి చేరవేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ వెలుగుచూశాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని వర్చువల్‌గా హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించిన సమయంలో ఓ రేంజ్‌లో హడావిడి చేసింది జ్యోతి మల్హోత్రా. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అప్పటి గవర్నర్‌ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్‌చల్‌ చేసింది ఈ యూట్యూబర్‌. గూఢచర్యం కేసులో అరెస్ట్‌ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటి వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

జ్యోతి మల్హోత్రా హైదరాబాద్‌కి కేవలం వందేభారత్‌ రైలు ఓపెనింగ్‌ ప్రోగ్రాం కోసమే వచ్చిందా? లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా? వేరే వీడియోలు ఏమైనా తీసిందా? అప్పుడంటే యూట్యూబర్‌. కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రుదేశంతో సమాచారం షేర్‌ చేసుకుంటోందని. అందుకే హైదరాబాద్‌లో అప్పట్లో ఆమె యాక్టివిటీపైన కూడా ఆరాతీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీస్‌.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్లక్రితం ఒడిశాలోని పూరీకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందని మరో యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్‌గా ఉంది. మరోవైపు పూరీజగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్లు నిఘాసంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. మూడు నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీకి ట్రావెలర్‌గానే వచ్చిందా.. లేదంటే ఇంకేమన్నా కారణముందా అన్న యాంగిల్‌లోనూ సాగుతోంది పోలీసు ఎంక్వయిరీ.

హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరీకి చెందిన యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. జ్యోతితో పాటు పూరీ యూట్యూబర్‌ కూడా పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఒడిశా పోలీసులు, ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో.. ఎలాంటి సంబంధం లేదని.. ఇద్దరం యూట్యూబర్లం మాత్రమేనంటోంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలలముందు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌కి వెళ్లింది యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా. దీంతో ఆ టూరిస్ట్‌ ప్లేస్‌ సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్‌ చేసుకుందా అన్న డౌట్‌తో ఆ దిశగా కూడా ఎంక్వయిరీ చేస్తున్నాయి నిఘాసంస్థలు. పహల్గామ్‌దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్‌ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. ఆమె టూర్‌, రియాక్షన్‌ రెండూ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కాగా.. తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తుండేదని, ఆమె పాకిస్తాన్‌కి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..