హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట నగరంలో సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. వీధుల్లో పార్క్ చేసే కార్లపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వీధుల్లో పార్క్‌చేసిన కారు పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి నిప్పంటిస్తున్నారు. దీంతో లక్షల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు మంటల్లో కాలిపోతున్నాయి. తాజాగా.. కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును తగులబెట్టింది ఈ పోకిరీల ముఠా. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. డే అంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. పోలీసులు స్పందించి ఇలాంటి పోకిరీలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరతున్నారు.