యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమెకు కూడా అతడిని లవ్ చేసింది. జీవితాంతం కలిసి బ్రతుకుదామని మాటిచ్చింది. కానీ ఉన్నఫలంగా వేరే వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది. దీంతో అతడి హృదయం ముక్కలైంది. ప్రేయసి పెళ్లి ఫోటోలు చూసి.. అతడు తల్లడిల్లిపోయాడు. ప్రపంచమంతా చీకటి అయినట్లు అనిపించింది. దీంతో తాను ఆమె మెడలో కట్టాలనుకున్న తాళిని జేబులో పెట్టుకొని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయకనగర్ కాలనీలో పందిగొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. వీరి రెండో తనయుడైన గణేశ్(23) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన సమీప ప్రాంతంలో ఉండే యువతిని ఏడాదిగా లవ్ చేస్తున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఆమెకు పేరెంట్స్ ఇటీవలే మరో యువకుడితో మ్యారేజ్ చేశారు. ఆ పెళ్లి ఫొటోలను ఆమె.. గణేశ్‌కి వాట్సప్‌లో సెండ్ చేసింది. యువతి పక్కన పెళ్లి కొడుకుగా తన బదులు.. మరొకరు ఉండటం చూసి.. అతడు జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం మునగనూరు శివారులో ఓ చెట్టుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతని జేబులో మంగళసూత్రం ఉంది. పోలీసులు కేసు ఫైల్ చేసి.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం