Hyderabad: అర్థరాత్రి దారుణం.. కత్తులతో పొడిచి, అమానుషంగా హత్య చేసి

|

May 12, 2022 | 11:26 AM

హైదరాబాద్(Hyderabad) లో నేరప్రవృత్తి రోజురోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో పట్టపగలే నడిరోడ్డుపై పరవు హత్య ఘటనను మరవకముందే....

Hyderabad: అర్థరాత్రి దారుణం.. కత్తులతో పొడిచి, అమానుషంగా హత్య చేసి
Langer House
Follow us on

హైదరాబాద్(Hyderabad) లో నేరప్రవృత్తి రోజురోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో పట్టపగలే నడిరోడ్డుపై పరవు హత్య ఘటనను మరవకముందే మరోసారి నగరం ఉలిక్కిపడింది. లంగర్ హౌజ్(Langer House) సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. కత్తులతో పొడిచి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. నగరంలోని లంగర్‌హౌస్‌లోని మెట్రో పిల్లర్‌ నంబర్ 96 వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. యువకుడిని చంపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరరాయ్యారు. మృతుడు చాంద్రాయణగుట్టలోని షాహీన్‌నగర్‌కు చెందిన జహంగీర్‌గా గుర్తించారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ సహాయంతో ఆధారాలు సేకరించారు. పాతకక్షల కారణంగా హత్య జరిగిందా? మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

TS ePass Scholarship 2022: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్‌! స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు మరో అవకాశం..చివరి తేదీ ఇదే!

IPL 2022 Points Table: ఢిల్లీ విజయంతో ఉత్కంఠగా మారిన ప్లే ఆఫ్‌ రేసు.. ఆ జట్లకు గట్టి హెచ్చరికలు పంపిన రిషభ్‌ సేన..