Hyderabad: కూకట్ పల్లిలో కలకలం.. ఉరి పోసుకుని అతడు.. విషం తాగి ఆమె…

అతడికి పెళ్లి కాలేదు.. ఆమెకు పెళ్లై విడాకులు తీసుకుంది. ఇరువురి మధ్య ప్రస్తుతం ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు అనధికారికంగా సమాచారం అందింది. మరి ఏమైందో తెలియదు కానీ ఫ్రెండ్ ఇంట్లో వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

Hyderabad: కూకట్ పల్లిలో కలకలం.. ఉరి పోసుకుని అతడు.. విషం తాగి ఆమె...
Suicide

Updated on: May 15, 2023 | 12:14 PM

కూకట్ పల్లిలో యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ఆకుల శ్యామ్‌, పాయిజన్ సేవించి పోతుల జ్యోతి సూసైడ్‌ చేసుకున్నారు. KPHB ఏడో ఫేజ్‌లో ఘటన వెలుగు చూసింది. భీమవరం దగ్గర్లోని గొల్లవానితిప్పకు చెందిన ఇరువురు.. నగరంలో ఉంటున్న  కృష్ణ అనే ఫ్రెండ్‌రూమ్‌కి వచ్చారు. పెళ్లికి వెళ్లొస్తానంటూ బయటకు వచ్చాడు కృష్ణ. తిరిగి ఇంటికి వెళ్లి చూడగా ఇరువురు విగతజీవులుగా కనిపించారు. సమాచారంతో పోలీసుల స్పాట్‌కు చేరుకుని.. డీటేల్స్ నమోదు చేసుకున్నారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా యువతికి గతంలోనే పెళ్లి కాగా.. విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ సమీప బంధువులుగా చెప్తున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు చెబుతామన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..