Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రం.. వేల సంఖ్యలో ఉద్యోగాలు!

| Edited By: Shaik Madar Saheb

Mar 06, 2025 | 12:18 PM

తెలంగాణలో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నాయి.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు ఉండటం.. అలాగే ప్రభుత్వ సహకారం అందుతుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి.. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది

Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రం.. వేల సంఖ్యలో ఉద్యోగాలు!
Lenskart
Follow us on

తెలంగాణలో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నాయి.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు ఉండటం.. అలాగే ప్రభుత్వ సహకారం అందుతుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి.. తాజాగా.. మరో అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్ (Lenskart) ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది. రూ.1500 కోట్ల భారీ పెట్టుబడితో తుక్కుగూడ నాన్-సెజ్ జనరల్ పార్క్‌లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగనుంది.

1600 మందికి ఉపాధి – ఉత్పత్తి ప్రారంభానికి గడువు

ఈ ప్లాంట్ రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయిలో నాలుగేళ్లలో కార్యకలాపాలు కొనసాగుతాయి. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత సుమారు 1600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం-లెన్స్‌కార్ట్ మధ్య 2024 డిసెంబర్ 8న ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందానికి అమలుగా గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్లాంట్‌కు శంకుస్థాపన జరగనుంది.

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తుల సరఫరా..

ఈ ప్లాంట్‌లో తయారయ్యే కళ్లజోడు ఉత్పత్తులను దేశీయ అవసరాలతో పాటు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, UAE, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి – పరిశ్రమల విస్తరణకు నూతన దిశ

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా, గ్లోబల్ కంపెనీలు తమ ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. లెన్స్‌కార్ట్ ప్రాజెక్ట్‌తో తెలంగాణ పరిశ్రమల రంగంలో మరో స్థాయికి చేరుకోనుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి