
Road Accident: హోలీ పండుగ రోజు తీవ్ర విషాదం. అవును ఊహించని విధంగా ఓ మహిళను మృత్యువు కాటేసింది. పైన చిత్రంలోని కారును చూస్తున్నారుగా!… ఎగిరి ఫుట్‌పాత్‌పై ఇలా పడిందంటే ఎంత వేగంతో వచ్చి ఉండొచ్చు!. కారు నడిపే వ్యక్తి ఎంత తాగి ఉండొచ్చు?… కారు టైర్లు కూడా ఊడిపోవడం అక్కడ మీరు గమనించవచ్చు. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ కారు సృష్టించిన టెర్రర్! ఎల్లా హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఎల్లా హోటల్‌లో పనిచేసే మహిళను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె స్పాట్‌లో మరణించింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో యువకుడితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సదరు మహిళ చెట్లకు నీళ్లు పడుతుండగా వేగంగా వచ్చిన కారు ఢికొట్టింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. వివరాలు తెలుసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం