Secunderabad: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా లేడీ ప్యాసింజర్.. ఆమె లగేజ్ చేయగా

|

Jun 12, 2024 | 5:22 PM

ఆమెను చూస్తే ఉత్తరాదికి చెందిన మహిళలా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లొ అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులను చూడగానే తెగ టెన్షన్ పడింది. ఒంటరి మహిళ.. ఏదైనా సమస్య ఉందేమో అని పోలీసులు వెళ్లి వివరాలు అడిగారు.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. లగేజ్ చెక్ చేశారు.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా లేడీ ప్యాసింజర్.. ఆమె లగేజ్ చేయగా
Secunderabad Railway Station
Follow us on

మీరు నెలంతా కూలి చేసినా సంపాదించలేని డబ్బు ఇస్తాం. జస్ట్ రెండు రోజుల మాత్రమే పని.. ఇలా ట్రైన్‌లో వెళ్లి అలా రావడమే. ఇలా అని చెప్పి పేద కుటుంబాల వారిని అక్రమ వ్యవహారాల్లోకి దించుతున్నారు కేటుగాళ్లు. వారు డబ్బుకు ఆశపడి ఆ పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. పాపం తర్వాత జైలు శిక్ష అనుభవిస్తూ.. కుటుంబాలకు దూరమై వేదన అనుభవిస్తున్నారు. గంజాయి.. ఇప్పుడు యువత పట్టి పీడిస్తున్న పెద్ద మత్తుమందు. ఈజీగా దొరకడం.. ధర కూడా తక్కువ అవ్వడంతో యువత దీనికి బానిస అవుతున్నారు. ప్రభుత్వాలు గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తన్నప్పటికీ.. కొందరు పెడ్లర్లు మాత్రం తగ్గేదే లేదన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. ఏకంగా బస్సులు, రైళ్లలో సైతం గంజాయి రవాణాకు పూనుకుంటున్నారు. తాము రిస్కులోకి పడకుండా.. పేదవర్గాలకు ఎక్కువ డబ్బులు ఇస్తామని  ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు.

ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయిని  పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో.. ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. తన వద్ద ఉన్న లగేజ్ చెక్ చేయగా.. సుమారు 20 కిలోల గంజాయి బయపడింది. నిందితురాలు మహారాష్ట్రకు చెందిన సునీతగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..