Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా..

|

Jul 30, 2024 | 3:47 PM

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది.

Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా..
Crime News
Follow us on

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. డిన్నర్ తర్వాత బస్సును తోటి డ్రైవర్‌కు అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం చేరవేసిందని తెలియగానే కృష్ణ బస్సు దిగి పారిపోయాడు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..

కదులుతున్న బస్సులో నోట్లో బెడ్ షీట్ కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ అఘాయిత్యం జరిగిందని పేర్కొంది.. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా డయల్ 100కి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన పోలీసులు బస్సును ఛేజ్ చేశారు.. ఈ క్రమంలో తార్నాక దగ్గర ఓయూ పోలీసులు బస్సును అడ్డగించి పట్టుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు మరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ఓయు (ఉస్మానియా యూనివర్సిటీ) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..