Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు హైదరాబాద్‌‌‌‌‌లో మద్యం షాపులు బంద్!

|

Mar 29, 2023 | 6:20 AM

మందుబాబులకు ముఖ్య అలెర్ట్. హైదరాబాద్‌లోని మద్యం షాపులు బంద్ కానున్నాయి. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర..

Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు హైదరాబాద్‌‌‌‌‌లో మద్యం షాపులు బంద్!
Wine Shops Bandh
Follow us on

మందుబాబులకు ముఖ్య అలెర్ట్. హైదరాబాద్‌లోని మద్యం షాపులు బంద్ కానున్నాయి. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 ఉదయం 6 గంటల వరకు ఆయా మద్యం షాపులు అన్ని బంద్ కానున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ ఆదేశాలు జారీ చేశామని పోలీసులు తెలిపారు. అటు బ్లాక్ మార్కెట్‌లో మద్యం అమ్మేవారిపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.

మరోవైపు శ్రీరామనవమి శోభాయాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణమంతా బలగాలను మోహరించనున్నారు. భారీ భద్రతతో పోలీసులు నిఘాలో శాంతియుత వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.