తమిళనాట తాడోపేడో.. తోడూనీడగా తెలంగాణ.. దక్షిణాన ఆగని పునర్విభజన రగడ!

దక్షిణాదిన డబుల్‌ షూటర్‌గా కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు సీఎం స్టాలిన్. ఈ ట్రబుల్ నా ఒక్కడిది కాదు.. మనందరిదీ. నాతో కలసి రండి పోరాడతాం.. అంటూ సదరన్ స్టేట్స్‌ వైపు చెయ్యి చాచారు. ఒకచేత్తో హిందీ పెత్తనంపై పోరాడుతూనే మరో చేత్తో డీలిమిటేషన్‌ను అడ్డుకోవాలన్నది స్టాలిన్ ప్రయత్నం.

తమిళనాట తాడోపేడో.. తోడూనీడగా తెలంగాణ.. దక్షిణాన ఆగని పునర్విభజన రగడ!
Web. 01

Updated on: Mar 13, 2025 | 10:00 PM

దక్షిణాదిన డబుల్‌ షూటర్‌గా కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు సీఎం స్టాలిన్. ఈ ట్రబుల్ నా ఒక్కడిది కాదు.. మనందరిదీ. నాతో కలసి రండి పోరాడతాం.. అంటూ సదరన్ స్టేట్స్‌ వైపు చెయ్యి చాచారు. ఒకచేత్తో హిందీ పెత్తనంపై పోరాడుతూనే మరో చేత్తో డీలిమిటేషన్‌ను అడ్డుకోవాలన్నది స్టాలిన్ ప్రయత్నం. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మనమే.. అంటున్న స్టాలిన్‌కి కోరస్ ఇచ్చేదెవరు..? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి..? ఎనిమిదేళ్ల కిందట.. చెన్నయ్‌ మెరీనా తీరం జనసంద్రంగా మారిన సందర్భం. ఆత్మగౌరవం కోసం లక్షలాదిమంది తమిళులు రోడ్డెక్కి కేంద్రంతో చేసిన పోరాటం. తమ సంప్రదాయ సాహకక్రీడ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయించుకున్న ఘట్టం. మా దాకా వస్తే అంతే.. ప్రభుత్వమూ ప్రజలూ ఒక్కటౌతాం.. కలిసి కొట్లాడాం.. చావో రేవో తేల్చుకుంటాం. మా భాష మీద, మా కల్చర్ మీద, మా ప్రాంతం మీద పెత్తనానికొస్తే పాతరేస్తాం.. ఇదీ తమిళనాట ఎప్పుడూ కనిపించే ఫైటింగ్ స్పిరిట్. ద్రవిడగడ్డ మీద ఇప్పుడు మళ్లీ ఒక ఉద్యమం మొదలైనట్టుంది. ఎస్.. డీలిమిటేషన్.. తమిళనాట డూ ఆర్‌ డై సిట్యువేషన్‌గా మారింది. ఇది దక్షిణాది మొత్తానికీ పాకుతుందా..? హిందీ ఇంపోజిషన్‌తో తమిళనాడుపై కేంద్రం కర్రపెత్తనం.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ద్రోహం.. ఈ రెండూ మా గుండెల్ని మండిస్తున్నాయ్… న్యాయం కావాలి.. అన్యాయాన్ని ఎదిరించాలి.. అంటూ కలిసొచ్చే పార్టీల్ని వెంటేసుకుని వెళ్లి మోదీ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి