Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర ప్రజలకు అలెర్ట్.. ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు

GHMC Water Supply: భాగ్యనగరంలో.. తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో

Hyderabad Water Supply: హైదరాబాద్‌ నగర ప్రజలకు అలెర్ట్.. ప‌లుచోట్ల తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు
Water Supply

Updated on: Jul 01, 2021 | 5:59 PM

GHMC Water Supply: భాగ్యనగరంలో.. తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే మరమ్మతు పనులను చేపడుతోంది. దీంతో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. మరమ్మతు పనుల్లో భాగంగా మరోసారి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి మంగళవారం వరకూ పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద మారుతీ సుజికి షోరూం నుంచి దుర్గా వైన్స్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా 05.07.2021 సోమ‌వారం ఉద‌యం 6 గంటల నుంచి మరుసటి రోజు మంగళవారం (06.07.2021) ఉద‌యం 6 గంటల వరకు 24 గంటల పాటు పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు. కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని.. అధికారులు సూచించారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ‌, గౌత‌మ్ న‌గ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
5. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
6. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 13 – మ‌హింద్ర హిల్స్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
7. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కాన‌గ‌ర్, బీరప్పగడ్డ రిజర్వాయర్ ప్రాంతాలు.
8. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు.
9. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.

Also Read:

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాడీవేడీగా వాదనలు..ధర్మాసనం ఏమన్నదంటే

Woman Doctor Raped: దారుణం.. ఫుడ్‌ డెలివరీ ఇచ్చేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం..