Drink And Drive: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాల తనిఖీలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 18 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో 9 కార్లు, 9 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. అలాగే మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 48 కేసులు నమోదయ్యాయి. అక్కడ మద్యం తాగి వాహనాలు నడిపిస్తున్న వారు అడ్డంగా బుక్కైపోయారు. ఈ తనిఖీల్లో 38 బైక్‌లు, 10 కార్లు సీజ్ చేశారు పోలీసులు.
కాగా, నగరంలో మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా.. వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీరి కారణంగా అమయాకులు బలవుతున్నారు. గత కొద్ది రోజులుగా నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిపి వేయగా, ఇటీవల మళ్లీ ప్రారంభించారు పోలీసులు. దీంతో మద్యం తాగి పోలీసులకు దొరికిపోతున్నారు. మద్యం తాగకుండా వాహనాలు నడపాలని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నా.. వాహనదారుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. పోలీసులకు పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. కొందరికి భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతోంది.